USA : కొలంబియా యూనివర్సిటీ అధ్యక్షురాలు రాజీనామా..!

అమెరికా మాన్‌హట్టన్‌లోని కొలంబియా యూనివర్సిటీ లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.

Update: 2024-08-15 22:47 GMT

దిశ, వెబ్‌డెస్క్ : అమెరికా మాన్‌హట్టన్‌లోని కొలంబియా యూనివర్సిటీ లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం కారణంగా యూనివర్సిటీ లో పాలస్తీనియన్లను , జూదులను ప్రత్యేకంగా విడదీసి పాఠాలు బోధిస్తున్నారాని పాలస్తీనియన్ అనుకూల వర్గాలు గత కొన్ని రోజుల నుండి నిరసనలు చేపడుతున్నారు.ఈ నిరసనలు చేయి దాటిపోవడంతో కొలంబియా యూనివర్సిటీ అధ్యక్షురాలు మినోచే షఫిక్ తన పదవికి రాజీనామా చేశారు.అయితే ఈ సంవత్సరం విద్యార్థుల నిరసనలతో కొలంబియా యూనివర్సిటీ దద్దరిల్లింది. పాలస్తీనియన్ అనుకూల నిరసనకారులు ఒక భవనంపై దాడి చేసిన దృశ్యాలు సోషల్ మీడియాలో వెలుగుచూశాయి. ఇలాంటి నిరసనలు దేశవ్యాప్తంగా కళాశాల క్యాంపస్‌లను చుట్టుముట్టాయి.

ఈ మేరకు షఫీక్ తన రాజీనామాను ప్రకటించిన తరువాత ఒక లేఖ విడుదల చేశారు. ఆ లేఖలో.. తన హయాంలో కొలంబియా యూనివర్సిటీ అనేక రంగాలలో పురోగతి సాధించిందని తెలియజేశారు. తన పదవీకాలంలో ప్రతి విద్యార్ధి యొక్క భిన్నమైన అభిప్రాయాలను తెలుసుకోవడం కష్టతరంగా ఉండేదని, తాను రాజీనామా చేయడానికి గల కారణం క్యాంపస్ లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులేనని ఆమె లేఖలో వెల్లడించింది.దీంతో కొలంబియా యూనివర్శిటీ తాత్కాలిక అధ్యక్షురాలిగా ఇర్వింగ్ మెడికల్ సెంటర్ CEO అయిన కత్రినా ఆర్మ్‌స్ట్రాంగ్ ను ట్రస్టీల బోర్డు ప్రకటించింది.కాగా.. షఫిక్ గత సంవత్సరం కొలంబియా యూనివర్శిటీకి అధ్యక్షురాలిగా ఎంపికయ్యారు. ఈ పాత్రను పోషించిన మొదటి మహిళగా షఫిక్ రికార్డుల్లోకెక్కారు.

Tags:    

Similar News