Lebanon : లెబనాన్ నుంచి వచ్చేయండి.. తమ పౌరులకు అమెరికా, యూకే అడ్వైజరీ

దిశ, నేషనల్ బ్యూరో : యుద్ధ మేఘాలతో ఇజ్రాయెల్ - లెబనాన్ బార్డర్ వేడెక్కింది.

Update: 2024-08-03 16:55 GMT

దిశ, నేషనల్ బ్యూరో : యుద్ధ మేఘాలతో ఇజ్రాయెల్ - లెబనాన్ బార్డర్ వేడెక్కింది. ఈనేపథ్యంలో అమెరికా, యూకే ప్రభుత్వాలు లెబనాన్‌లోని తమ పౌరులకు అత్యవసర అడ్వైజరీని జారీ చేశాయి. హుటాహుటిన అందుబాటులో ఉన్న టికెట్లు బుక్ చేసుకొని స్వదేశాలకు తిరిగి వచ్చేయాలని పిలుపునిచ్చాయి. కొన్ని ఎయిర్ లైన్స్ కంపెనీలు విమాన సర్వీసులను రద్దు చేసినప్పటికీ.. మిగతా వాటిలో అందుబాటులో ఉన్న టికెట్ల కోసం ప్రయత్నించాలని కోరాయి. ఎలాగోలా లెబనాన్ నుంచి బయటపడాలని సూచించాయి.

లెబనాన్ మిలిటెంట్ సంస్థ హిజ్బుల్లా, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం తీవ్రరూపు దాలుస్తున్న ప్రస్తుత తరుణంలో లెబనాన్‌లోని అమెరికా, యూకే రాయబార కార్యాలయాలు ఇచ్చిన అడ్వైజరీలు ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. ‘‘ఇజ్రాయెల్ - లెబనాన్ మధ్య ఉద్రిక్తతలు తారస్థాయిలో ఉన్నాయి. పరిస్థితులు మరింత దిగజారే అవకాశం లేకపోలేదు’’ అని అని బ్రిటన్ విదేశాంగ మంత్రి డేవిడ్ లామీ పేర్కొన్నారు. తక్షణమే లెబనాన్ వదిలి వచ్చేయాలని బ్రిటన్ పౌరులను ఆయన కోరారు. త్వరలో లెబనాన్‌పై ఇజ్రాయెల్ మరిన్ని వైమానిక దాడులు చేయొచ్చనే అంచనాలకు బలం చేకూర్చేలా ఈ అడ్వైజరీ ఉందని పరిశీలకులు అంటున్నారు.

Tags:    

Similar News