Israel : ఇజ్రాయెల్‌కు అమెరికా ‘థాడ్’.. ఇరాన్ స్ట్రాంగ్ రియాక్షన్

దిశ, నేషనల్ బ్యూరో : ఇటీవలే ఇజ్రాయెల్‌పై ఇరాన్ మిస్సైళ్లతో విరుచుకుపడిన నేపథ్యంలో నేరుగా అమెరికా రంగంలోకి దిగింది.

Update: 2024-10-13 18:38 GMT

దిశ, నేషనల్ బ్యూరో : ఇటీవలే ఇజ్రాయెల్‌పై ఇరాన్ మిస్సైళ్లతో విరుచుకుపడిన నేపథ్యంలో నేరుగా అమెరికా రంగంలోకి దిగింది. ఇజ్రాయెల్‌కు అత్యాధునిక క్షిపణి రక్షణ వ్యవస్థ ‘టెర్మినల్ హై ఆల్టిట్యూడ్ ఏరియా డిఫెన్స్’ (థాడ్)‌ను అందిస్తామని ఆదివారం ప్రకటించింది. స్వయంగా తమ దేశ సైనిక బలగాలు ఇజ్రాయెల్‌కు వెళ్లి.. థాడ్‌ను ఇన్‌స్టాల్ చేసి, వినియోగంలోకి తెస్తాయని అగ్రరాజ్యం వెల్లడించింది. ఇజ్రాయెల్ భద్రతకు అమెరికా తొలి ప్రాధాన్యత ఇస్తుందని స్పష్టం చేసింది.

అమెరికా ప్రకటనపై ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఖ్చీ ఘాటుగా స్పందించారు. ‘‘థాడ్ మిస్సైల్ సిస్టమ్‌ను ఆపరేట్ చేసేందుకు సైనికులను ఇజ్రాయెల్‌కు పంపడం ద్వారా అమెరికా చాలా రిస్క్ తీసుకుంటోంది. దీనివల్ల అమెరికా సైనికుల ప్రాణాలు అపాయంలో పడతాయి. అమెరికాకు ఇజ్రాయెల్ ఎంత ముఖ్యమో.. మాకు ఇరాన్ ప్రజలు అంతే ముఖ్యం.. అందుకోసం మేం ఏదైనా చేస్తాం’’ అని అబ్బాస్ అరఖ్చీ ‘ఎక్స్’ వేదికగా హెచ్చరించారు.


Similar News