Israel-Iran: పశ్చిమాసియాలో ఉద్రిక్తతల వేళ అమెరికా కీలక నిర్ణయం

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరిగిపోయాయి. ఇలాంటి సమయంలో అమెరికా సంచలన ప్రకటన చేసింది.

Update: 2024-10-12 04:02 GMT

దిశ, నేషనల్ బ్యూరో: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరిగిపోయాయి. ఇలాంటి సమయంలో అమెరికా సంచలన ప్రకటన చేసింది. ఇరాన్‌కు చెందిన పెట్రోలియం, పెట్రో కెమికల్‌ రంగాలపై అమెరికా తన ఆంక్షలను విస్తరించింది. అయితే, ఇటీవల ఇజ్రాయెల్‌పై ఇరాన్ బాలిస్టిక్‌ మిసైల్స్ తో విరుచుకుపడింది. అయితే, ఆ దాడులకు ప్రతీకారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమెరికా ట్రెజరీ డిపార్ట్ మెంట్ ఈ విషయాన్ని ప్రకటించింది. ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ దాడికి ప్రతిస్పందనగా ఈ చర్యకు పూనుకంది. ఇరాన్ కు నిధులు సమకూర్చే సామర్థ్యాన్ని దెబ్బకొట్టేలా యూఎస్‌ నిర్ణయాత్మక చర్య తీసుకుంది. ఇరాన్‌కు చెందిన పెట్రోలియం, పెట్రోకెమికల్ రంగాలపై అమెరికా ఆంక్షలను విస్తరించింది. ఇక, ఈ క్రమంలోనే 16 సంస్థలను, 17 నౌకలను బ్లాక్‌ ప్రాపర్టీగా గుర్తించినట్లు ట్రెజరీ డిపార్ట్‌మెంట్ తెలిపింది. ఇవి నేషనల్‌ ఇరానియన్‌ ఆయిల్‌ కంపెనీకి మద్దతుగా ఇరానియన్‌ పెట్రోలియం, పెట్రోకెమికల్‌ ఉత్పత్తులను రవాణా చేస్తున్నట్లు ఆరోపించింది.

ఇజ్రాయెల్ పై ఇరాన్ దాడి

ఇకపోతే, ఇజ్రాయెల్‌ దాడుల్లో హెజ్‌బొల్లా అధినేత నస్రల్లా మృతి చెందాడు. కాగా.. దీనికి ప్రతీకారంగా ఇరాన్‌ 200 బాలిస్టిక్‌ క్షిపణులతో ఇజ్రాయెల్‌పై విరుచుకుపడింది. దీంతో ఇరాన్‌ పెద్ద తప్పు చేసిందని, దీనికి మూల్యం చెల్లించుకుంటుందని ఇజ్రాయెల్ ప్రధాని హెచ్చరించారు. అయితే, ఇరాన్‌కు చెందిన చమురు, అణుస్థావరాలను లక్ష్యంగా ఇజ్రాయెల్‌ దాడులు చేస్తుందని ప్రపంచవ్యాప్తంగా ఆందోళన చెలరేగింది. కానీ, వాటికి భిన్నంగా ఇరాన్ ఆర్థిక కార్యకలాపాలపై దెబ్బకొట్టేనా అమెరికా అధ్యక్షుడు ప్రత్యమ్నాయాన్ని ఆలోచించారు. అందులో భాగంగానే ఇరాన్‌కు చెందిన పెట్రోలియం, పెట్రోకెమికల్‌ రంగాలపై ఉన్న ఆంక్షలను యూఎస్‌ విస్తరిస్తున్నట్లు పేర్కొంది.


Similar News