US President Elections : కమలా హారిస్ సంచలన ప్రకటన

అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ,డెమొక్రాటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా పోటీచేస్తున్న భారత సంతతి మహిళా కమలా హారిస్ ప్రచారంలో దూకుడును పెంచారు

Update: 2024-08-12 21:02 GMT

దిశ, వెబ్‌డెస్క్ : అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ డెమొక్రాటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా పోటీచేస్తున్న భారత సంతతి మహిళా కమలా హారిస్ ప్రచారంలో దూకుడును పెంచారు. ఇప్పటికే కమలా హారిస్ కు డెమొక్రాటిక్ పార్టీ వర్గాలు తమ పూర్తి మద్దత్తును ప్రకటిస్తున్నట్టు తెలిపాయి. దీంతో ఇతర పార్టీ వర్గాల మద్దత్తు కోసం హారీస్ వ్యూహాలు పన్నుతున్నారు. మరోవైపు పలు సర్వేల ప్రకారం రిపబ్లికన్ నేత ట్రంప్ కన్నా కమలా హారీస్ 4 పాయింట్ల ముందంజలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో హారీస్ ఒక సంచలన హామీ ప్రకటించారు.కమలా హారీస్ నిన్న లాస్ వేగాస్ లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు .

ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె మాట్లాడూతూ.."అమెరికా ఆర్థిక వ్యవస్థ ముఖ్యంగా రెస్టారెంట్లు, హోటల్స్ పైన ఆధారపడి ఉందని , ఈ క్రమంలోనే వీటిలో పని చేసే కార్మికులకు ఇచ్చే టిప్పులపై పన్ను ఎత్తివేస్తామని" సంచలన హామీని ప్రకటించారు. అలాగే కార్మికుల వేతనాలు పెరిగేలా కృషి చేస్తానని, వారి కుటుంబాల తరుపున నిత్యం పోరాడుతానని అన్నారు . దీంతో అమెరికా రాజకీయ వర్గాల్లో హారీస్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి . ఈ హామీపై ట్రంప్ స్పందిస్తూ .. కమలా హారిస్ తన హామీని కాపీ కొట్టిందని, ఈ హామీని నేను ఇదివరకే చాలా సందర్బాల్లో ప్రకటించానని హారిస్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Tags:    

Similar News