UK Family Visa : భారతీయులకు గుడ్ న్యూస్ చెప్పిన బ్రిటన్ ప్రభుత్వం

బ్రిటన్ లో నివసిస్తున్న భారతీయులకు అక్కడి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.

Update: 2024-08-11 06:52 GMT

దిశ, వెబ్‌డెస్క్ : బ్రిటన్ లో నివసిస్తున్న భారతీయులకు అక్కడి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. బ్రిటన్ పౌరసత్వం ఉన్న వాళ్లకు అలాగే బ్రిటన్ దేశ శాశ్వత వీసా ఉన్న వాళ్లకు కొత్తగా ఏర్పడిన బ్రిటన్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇక నుంచి కుటుంబ వీసా స్పాన్సర్ చేయాలనుకునే వాళ్లకు వారి వార్షిక ఆదాయం 38,000 పౌండ్లు ( 41.5 Lakhs ) ఉండాల్సిన అవసరం లేదని తెలిపింది.

కాగా ఇంతక ముందు ఎవరైనా కుటుంబ వీసా స్పాన్సర్ చేయాలంటే వారి వార్షిక ఆదాయం 29,000 పౌండ్లుగా ఉండాలి. కానీ గత రిషి సునాక్ ప్రభుత్వం దాన్ని 38 వేల పౌండ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. తాజాగా ఆ నిర్ణయాన్ని పక్కన పెడుతున్నట్టు కీర్ స్టార్మర్ ప్రభుత్వం తెలిపింది. దీంతో లేబర్ పార్టీ తీసుకున్న నిర్ణయం పట్ల అక్కడ నివసిస్తున్న భారతీయులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.కాగా ఈ నిర్ణయం 2025 నుంచి అమల్లోకి వస్తుందని బ్రిటన్ హోంశాఖ మంత్రి యొవట్ కూపర్ ఇటీవల వెల్లడించారు. కీర్ స్టార్మర్ ప్రభుత్వం వలసలకు సంబంధించి కొత్త విధానాలను అనుసరిస్తుందని యొవట్ కూపర్ తెలిపారు.

Tags:    

Similar News