Typhoon Yagi: 'యాగి' తుఫాన్ బీభత్సం..వరదల ధాటికి నదిలో కూలిపోయిన బ్రిడ్జి

టైఫూన్ యాగి(Typhoon Yagi) బీభత్సం సృష్టిస్తోంది.

Update: 2024-09-09 19:21 GMT

దిశ, వెబ్‌డెస్క్:టైఫూన్ యాగి(Typhoon Yagi) బీభత్సం సృష్టిస్తోంది. మొన్నటి వరకు చైనా(China),హాంకాంగ్‌(Hongkong) దేశాలను అతలాకుతలం చేసిన ఈ తుఫాన్ తాజాగా వియత్నాం(Vietnam)పై పంజా విసిరింది.ఈ తుఫాన్ కారణంగా చాలా మంది మరణించారు. యాగి తుఫాన్ శనివారం వియత్నాం తీరం దాటిన సమయంలో అక్కడి ప్రాంతాలు వణికిపోయాయి.విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో లక్షల మందికి పైగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.లక్షల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లు సమాచారం.ఈ టైఫూన్ ధాటికి వచ్చిన వరదల కారణంగా కొండచరియలు విరిగిపడటంతో 59 మంది మరణించగ, 176 మంది వరకు గాయపడ్డారు. ఈ తుఫాన్ గత దశాబ్ద కాలంలో భయంకర తుఫాన్ లో 'యాగి'ని ఒకటిగా అధికారులు పేర్కొంటున్నారు. ఈ సంవత్సరం ఆసియా(Asia)ను తాకిన అత్యంత శక్తివంతమైన తుఫాన్‌గా యాగి రికార్డుకెక్కింది. ఈ తుఫాన్ కాస్త అల్ప‌పీడ‌నంగా మారినా.. వ‌ర‌ద‌లు, కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డే అవకాశం ఉండటంతో ముందు జాగ్రత్తగా వియత్నాం తీర ప్రాంత ప్ర‌జ‌ల‌ను సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లించారు. దాదాపు 12 ప్రావిన్సుల్లో స్కూళ్ల‌ను తాత్కాలికంగా మూసివేశారు.  

యాగి తుఫాన్ ధాటికి ఉత్తర వియత్నాంలోని ఫుథో ప్రావిన్స్‌(Phu Tho Province)లో ఓ నదిపై నిర్మించిన ఉక్కు వంతెన ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ఘటనలో 10 కార్లు, ట్రక్కులు, రెండు బైక్‌లు నీళ్లలో పడిపోయినట్లు ఉప ప్ర‌ధాని(Deputy Prime Minister) హో డుక్ ఫోక్(Ho Duc Phoc) తెలిపారు.నదిలో పడిపోయిన వారిలో ముగ్గుర్ని రక్షించగా, మరో 13 గల్లంతయినట్టు తెలుస్తోంది.గల్లంతయిన వారి కోసం రెస్క్యూ ఆపరేషన్‌ కొనసాగుతోంది. ఈ ప్రమాదం నుంచి బయటపడిన ఓ వ్యక్తి స్థానిక మీడియాతో మాట్లాడూతూ.. 'నేను మోటార్‌సైకిల్‌పై వంతెన మీద వెళ్తున్నప్పుడు పెద్ద శబ్దం వినిపించింది. ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే నదిలో పడిపోయాను. ఎలాగోలా ఈత కొడుతూ బయట పడ్డానని' తెలిపాడు. దాదాపు 375 మీట‌ర్ల పొడుగు ఉన్నఈ ఉక్కు బ్రిడ్జ్‌లో కొంత భాగమే మిగిలి ఉంది.కాగా కూలిపోయిన బ్రిడ్జ్‌ను వీలైనంత త్వ‌ర‌గా నిర్మించాల‌ని ఆర్మీని ఆదేశించిన‌ట్లు ఉప ప్ర‌ధాని హో డుక్ ఫోక్ తెలిపారు.  



Similar News