శృంగార పాఠాలను బోధించేందుకు క్యాంపులు.. మొదటి రోజు అలా.. రెండో రోజు ఇలా... భారీ రెస్పాన్స్..

చైనాలో సరికొత్త ట్రెండ్ నడుస్తోంది. ఇప్పటి వరకు ఫ్యామిలీ వాల్యూస్, పితృస్వామ్య భావజాలానికి కట్టుబడి ఉన్న మహిళలు.. తమకు ఆనందాన్ని పంచే సరికొత్త మార్గం కోసం బయటకు వచ్చారు. శృంగారం అనే టాపిక్ గురించి మాట్లాడటం అక్కడ ఒక తప్పుగా పరిగణించబడేది.

Update: 2024-09-18 14:52 GMT

దిశ, ఫీచర్స్ : చైనాలో సరికొత్త ట్రెండ్ నడుస్తోంది. ఇప్పటి వరకు ఫ్యామిలీ వాల్యూస్, పితృస్వామ్య భావజాలానికి కట్టుబడి ఉన్న మహిళలు.. తమకు ఆనందాన్ని పంచే సరికొత్త మార్గం కోసం బయటకు వచ్చారు. శృంగారం అనే టాపిక్ గురించి మాట్లాడటం అక్కడ ఒక తప్పుగా పరిగణించబడేది. కానీ ఇప్పుడు సెక్స్ అప్పీల్ క్యాంపులకు అటెండ్ అవుతున్నారు. అవును.. జెజియోంగ్ ప్రావిన్స్ లోని హాంగ్జౌలో జరిగిన ఈ శిబిరానికి భారీ రెస్పాన్స్ వచ్చింది. ఇందుకు హాజరైన మహిళలు 35 నుంచి 50ఏళ్ల మధ్య వయస్కులే కావడం విశేషం.

ఇంతకీ అసలు సంగతి ఏంటంటే... భర్త దారి తప్పుతున్నాడని తెలిసిన మహిళల కోసం ఈ శిబిరాలు నిర్వహిస్తున్నారు. తమ వైపు ఆకర్షించేలా చేసేందుకు శిక్షణ ఇస్తున్నారు. రెండు రోజుల క్యాంపులో పాల్గొనేందుకు దాదాపు రూ. 35 వేలు తీసుకుంటుండగా... మొదటి రోజు ప్రేమ, భావప్రాప్తి గురించి పాఠాలు, రెండో రోజు భాగస్వామితో ఉన్నప్పుడు ముద్దులు, సన్నిహితంగా ఉండేలా ప్రేరేపించడం, రోల్ ప్లేయింగ్ వంటి వాటి గురించి బోధించినట్లు తెలుస్తుంది.

Tags:    

Similar News