Eggs: శీతాకాలంలో రోజుకొక గుడ్డు తీసుకుంటే ఆ సమస్యలకు చెక్ పెట్టొచ్చు!

ఉష్ణోగ్రతలు పడిపోయినప్పుడు రక్త ప్రసరణ మందగిస్తుంది.

Update: 2024-12-25 06:46 GMT

దిశ, వెబ్ డెస్క్ : శీతాకాలంలో మనకి అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి.  ఉష్ణోగ్రతలు పడిపోయినప్పుడు  రక్త ప్రసరణ మందగిస్తుంది, ఎముకలు బలహీనపడతాయి, జుట్టు రాలడం వంటి సమస్యలు వస్తాయి. ఆహారంలో చిన్న చిన్న మార్పులు చేయడం వలన కొన్ని అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టొచ్చు. అయితే, ఎలాంటి ఆహారాలు తీసుకోవాలో ఇక్కడ చూద్దాం..

మనకి చౌకగా దొరికే వాటిలో గుడ్లు కూడా ఒకటి. దీనిలో అధిక ప్రోటీన్, ఒమేగా-3 వంటి లక్షణాలను ఉంటాయి. అలాగే, ఈ కాలంలో వచ్చే సమస్యల నుంచి రక్షించే ఖనిజాలు, విటమిన్లను కలిగి ఉంటాయి. విటమిన్ డి అధికంగా ఉండే గుడ్లు ఎముకలు బలపరుస్తాయి. కాబట్టి రోజుకొక గుడ్డును తీసుకోవాలి. శరీరం వాటి నుండి విటమిన్ డిని ఉత్పత్తి చేస్తుంది. గుడ్లు పొట్ట కొవ్వును కరిగేలా చేస్తాయి. ఇది అతిగా తినడాన్ని కూడా తగ్గిస్తుంది.

అంతే కాదు, హార్మోన్ల పనితీరును మెరుగుపరుస్తుంది. అలాగే, శరీరం బరువు తగ్గించడంలో సహాయపడుతుంది. గుడ్లలో ఆస్టియోజెనిక్ బయోయాక్టివ్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతుంది. కీళ్ల నొప్పులు, ఆర్థరైటిస్ వంటి ఎముకల సమస్యలతో బాధ పడేవారు దీనిని తీసుకుంటూ ఉండాలి.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి తీసుకోబడింది. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే. ‘దిశ’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.

Tags:    

Similar News