Trump vs Kamala : ట్రంప్-హారిస్ మధ్య డిబేట్..! ఎప్పుడంటే.?

గత కొన్ని రోజులుగా అగ్రరాజ్యం అమెరికాలో ఎన్నికల సందడి నెలకొన్న సంగతి తెలిసిందే.

Update: 2024-08-04 12:11 GMT

దిశ, వెబ్‌డెస్క్ : గత కొన్ని రోజులుగా అగ్రరాజ్యం అమెరికాలో ఎన్నికల సందడి నెలకొన్న సంగతి తెలిసిందే. కాగా త్వరలో జరగనున్న అధ్యక్ష ఎన్నికల బరిలోనుండి తప్పుకుంటున్నట్లు బైడెన్ ఇదివరకే ప్రకటించారు. దీంతో డెమోక్రటిక్ పార్టీ, తమ పార్టీ నుండి అధ్యక్ష అభ్యర్థిగా భారత సంతతి మహిళా, ప్రస్తుత వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ ను ఎన్నుకున్నారు. ఈ క్రమంలో.. ఆమెతో డిబేట్ పెట్టడానికి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, డొనాల్డ్ ట్రంప్ అంగీకరించారు. "ఫాక్స్ న్యూస్"(FOX NEWS) నుండి అందిన ఆహ్వానం మేరకు సెప్టెంబర్ 4న పెన్సుల్వేనియాలో హారిస్ తో చర్చకు తాను సిద్ధమని తెలిపారు.

ఈ సందర్బంగా ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ "ట్రూత్ (TRUTH)" వేదికగా మాట్లాడూతూ.. 'సెప్టెంబర్ 4న  నాకు,కమలా హారిస్ మధ్య ఫాక్స్ న్యూస్ నిర్వహించాలనుకుంటున్న ఈవెంట్ లో తాను తప్పక పాల్గొంటానని, అలాగే.. JUNE 27న బైడెన్ తో జరిగిన చర్చలోని రూల్స్.. ఈ డిబేట్ కు కూడా వర్తిస్తాయని' చెప్పారు. అయితే ఈ డిబేట్ కు కమలా హారిస్ అంగీకరించారా? లేదా? అన్నది ఇంకా తెలియలేదు. కాగా కొన్ని రోజుల కిందట కమలా హారిస్ పై,ట్రంప్ చేసిన వాఖ్యలు వివాస్పదమయ్యాయి. ఈ నేపథ్యంలో వీరిద్దరి మధ్య చర్చెప్పుడు ఉండబోతుందనే ఆసక్తి అమెరికా ప్రజల్లో నెలకొంది.  

Tags:    

Similar News