Trump vs Harris:ట్రంప్-హారిస్ మధ్య తొలి డిబేట్..రూల్స్ ఇవే..

అగ్రరాజ్యం అమెరికా(America)లో నవంబర్ 5న ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే.

Update: 2024-09-09 21:38 GMT

దిశ, వెబ్‌డెస్క్:అగ్రరాజ్యం అమెరికా(America)లో నవంబర్ 5న ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధ్యక్ష అభ్యర్థులిద్దరు తమ ప్రచారాన్ని ముమ్మరం చేశారు.ఈ ఎన్నికల్లో డెమోక్రాటిక్(Democratic) పార్టీ అభ్యర్థి కమలా హారిస్(Kamala Harris) కే విజయావకాశాలు ఉన్నాయని పలు సర్వేలు సూచించగా .. అటు రిపబ్లికన్(Republican) పార్టీ నేత, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) అధికార పార్టీపై విమర్శలు చేస్తూ దూసుకుపోతున్నారు.ఇదిలా ఉంటే ప్రపంచ వ్యాప్తంగా ఎదురు చూస్తున్న వీళ్లిద్దరి మధ్య తొలి డిబేట్ కు రంగం సిద్దమయింది.వీరిద్దరూ మంగళవారం మొదటిసారిగా చర్చలో తలపడనున్నారు. ఇద్దరి భేటీని రేపు(మంగళవారం)అమెరికా వార్తాసంస్థ ఏబీసీ న్యూస్‌(ABC News) నిర్వహించనుంది. అయితే ఇది వరకు ట్రంప్‌(Trump)-బైడెన్‌(Biden) మధ్య జరిగిన తొలి డిబేట్ వివాస్పదమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏబీసీ న్యూస్‌ కొన్ని కొత్త నిబంధనలతో ఈ డిబేట్ నిర్వహించనుంది. దీనికి ఇరువురు నేతలు కూడా అంగీకారం తెలిపినట్లు ఏబీసీ వెల్లడించింది.దీంతో ట్రంప్-కమలా మధ్య రేపు జరిగే తొలి డిబేట్ పై అమెరికా ప్రజలే కాక ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

వీరిద్దరి మధ్య డిబేట్ వివరాలు, వాటి రూల్స్ ఇలా ఉన్నాయి..

  • పెన్సుల్వేనియా (Pennsylvania) రాష్ట్రం ఫిలడెల్ఫియా(Philadelphia)లోని జాతీయ రాజ్యాంగ కేంద్రం(National Constitution Center)లో అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం(September 10) రాత్రి 9:00 గంటలకు ఈ డిబేట్‌ ప్రారంభం కానుంది.ఈ డిబేట్‌ను ఏబీసీ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. ఇక డిబేట్ జరిగే గదిలో ప్రేక్షకులు ఎవరూ ఉండరు.
  • ఈ ఈవెంట్‌ను ABC యాంకర్‌లు డేవిడ్ ముయిర్(David Muir), లిన్సే డేవిస్‌(Linsey Davis)లు నిర్వహిస్తారు.దాదాపు 90 నిమిషాల పాటు ఈ డిబేట్ జరగనుంది.డిబేట్ మధ్యలో రెండుసార్లు బ్రేక్ ఉంటుంది.
  • కొన్ని నెలల క్రితం ట్రంప్, బైడెన్‌ మధ్య జరిగిన తొలి డిబేట్‌ లో ఒకరినొకరు రన్నింగ్ కామెంటరీ చేసుకోవడంతో ఆ డిబేట్ వివాస్పదమైన విషయం తెలిసిందే.దీంతో ఈసారి ఒకరు మాట్లాడుతుండగా, మరొకరి మైక్‌లను మ్యూట్‌ చేస్తారు.
  • కేవలం యాంకర్లు మాత్రమే అభ్యర్థులను ప్రశ్నలు అడుగుతారు. ఎటువంటి ప్రశ్నలు అడుగుతారనే విషయాన్ని ముందుగా అభ్యర్థలకు తెలియజేయరు.ప్రతి ప్రశ్నకు సమాధానమివ్వడానికి వారికి రెండు నిమిషాలు టైం కేటాయిస్తారు.
  • చర్చ మొత్తం అభ్యర్థులు నిల్చొని కొనసాగించాల్సి ఉంటుంది. కాగా ముందస్తుగా రాసుకున్న నోట్స్ ను చర్చకు అనుమతించరు. కానీ డిబేట్‌ జరగుతున్న సమయంలో కీలక విషయాలను నోట్‌ చేసుకోవడానికి అభ్యర్థులకు ఒక పెన్ను, పేపర్‌ ప్యాడ్ అందజేస్తారు.
  • చర్చ మధ్యలో రెండు సార్లు ఇచ్చే బ్రేక్‌ సమయంలో తమ ప్రచారం బృందంతో మాట్లాడానికి అనుమతి లేదు.అయితే డిబేట్‌ చివరలో చెరో రెండు నిమిషాలు పాటు ముగింపు ప్రసంగం చేసేందుకు అనుమతిస్తారు.

Similar News