ట్రంప్ ర్యాలీపై రసాయన దాడి!

అమెరికా(America) అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తుండగా.. ఎన్నికల బరిలో నిలిచిన ట్రంప్(Trump) ప్రచార ర్యాలీలో ఓ కలకలం రేగింది.

Update: 2024-09-19 12:24 GMT

దిశ, వెబ్ డెస్క్ : అమెరికా(America) అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తుండగా.. ఎన్నికల బరిలో నిలిచిన ట్రంప్(Trump) ప్రచార ర్యాలీలో ఓ కలకలం రేగింది. ప్రచార ర్యాలీలో రసాయన దాడి(Chemical Attack) జరిగిందనే అనుమానమే దీనికి కారణం. ట్రంప్ ఎన్నికల ప్రచార ర్యాలీలో పాల్గొన్న పలువురు ఒకే విధమైన వింత అనారోగ్య సమస్యలకు గురవడం తీవ్ర చర్చకు దారితీసింది. ర్యాలీలో పాల్గొన్న దాదాపు 20 మందికి పైగా కంటి, చర్మ సంబంధిత సమస్యలతో ఆసుపత్రుల పాలయ్యారు. అందరూ ఒకేలాంటి సమస్యలు ఎదుర్కోవడంతో రసాయనిక దాడి జరిగిందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గతవారం అరిజోనా(Arizona)లోని టక్సన్ లో ట్రంప్ ఎన్నికల ర్యాలీలో పాల్గొనగా.. భారీ ఎత్తున మద్దతుదారులు ఈ ర్యాలీకి హాజరయ్యారు. ర్యాలీ అనంతరం చాలామందికి కంటిచూపు మసకబారడం, ముఖం ఉబ్బడం వంటి తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఏర్పడ్డాయి. వీరిలో కొందరిని అత్యవసర విభాగంలో ఉంచి చికిత్స అందించాల్సి వచ్చింది. దీనికి గల స్పష్టమైన కారణాలు తెలియకపోయినా.. ట్రంప్ లక్ష్యంగా దాడి జరిగినట్టు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కాగా ఈ ఘటనపై ఆరిజోనా పోలీసులు దర్యాప్తు చేపట్టారు.      


Similar News