21 ఏళ్లు వచ్చాయంటే అవయవదానం చేయాల్సిందే... రూల్ అమలు...
సింగపూర్‌లో 21 ఏళ్లు పైబడిన పౌరులందరూ ఆటోమేటిక్ గా ఆర్గాన్ డోనార్స్ గా నమోదు చేయబడతారు. ఇది అక్కడి రూల్ కూడా. ఆగ్నేయాసియా దేశం 1987లో అవయవ కొరతను ఎదుర్కొంది.
దిశ, ఫీచర్స్ : సింగపూర్‌లో 21 ఏళ్లు పైబడిన పౌరులందరూ ఆటోమేటిక్ గా ఆర్గాన్ డోనార్స్ గా నమోదు చేయబడతారు. ఇది అక్కడి రూల్ కూడా. ఆగ్నేయాసియా దేశం 1987లో అవయవ కొరతను ఎదుర్కొంది. ఫలితంగా మానవ అవయవ మార్పిడి చట్టం (HOTA- హ్యూమన్ ఆర్గాన్ ట్రాన్స్ ప్లాంట్ యాక్ట్) 2009లో పాస్ చేయబడింది. ఈ నియమం ప్రకారం 21 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న నివాసితులు.. మానసిక రుగ్మతలతో బాధపడనట్లయితే.. ఈ లిస్ట్ లో చేర్చబడుతారు. కాగా వైద్య చరిత్రలో అత్యంత గొప్ప విజయాలలో ఈ పద్ధతి ఒకటి కాగా ఆన్ లైన్ లో ప్రశంసలు అందుకుంటుంది.
HOTA ఇన్ఫర్మేషన్ బుక్‌లెట్ రూల్ లో.. "HOTA కింద ఉన్నవారు ఇతరులకు సహాయం చేసే అవకాశం మాత్రమే కాకుండా.. వారికి అవయవ మార్పిడి అవసరమైతే వెయిటింగ్ లిస్ట్‌లలో అధిక ప్రాధాన్యత ఉంటుంది. ఎందుకంటే అవసరం వచ్చినప్పుడు ఇది చాలా క్లిష్టమైనది" అని ఉంటుంది. కాగా ఇండియాలో మాత్రం ఈ పరిస్థితి భిన్నంగా ఉంది. గ్లోబల్ అబ్జర్వేటరీ ఆన్ డొనేషన్ అండ్ ట్రాన్స్‌ప్లాంటేషన్ ప్రకారం... భారతదేశపు అవయవ దాన రేటు పదికి 0.05 మాత్రమే ఉంది. ఇక ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం... భారతదేశంలో కేవలం 0.01 శాతం మంది మాత్రమే మరణానంతరం తమ అవయవాలను దానం చేస్తారు.
Read More..
MD Sajjanar : మరణించిన తర్వాత జీవించడం! టీజీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆసక్తికర ట్వీట్