Rose flowers: గులాబీ రేకులతో రెట్టింపు అందంతో పాటు..!
గులాబీ పూలు(Rose flowers) ఓన్లీ అందానికే కాదు.. ఆరోగ్యానికి కూడా అనేక ప్రయోజనాలున్నాయి.
దిశ, వెబ్‌డెస్క్: గులాబీ పూలు(Rose flowers) ఓన్లీ అందానికే కాదు.. ఆరోగ్యానికి కూడా అనేక ప్రయోజనాలున్నాయి. ‘ గులాబీ పూలను అలంకరణకు, చర్మ సౌందర్యానికి(Skin beauty) ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. రోజ్ వాటర్(Rose water), రోజ్ ఆయిల్(Rose oil) చాలా మంది మహిళలకు చర్మ సంరక్షణలో ముఖ్యమైన భాగం. చర్మంపై గులాబీలా గ్లో రావడానికి గులాబీ పువ్వులను కూడా ఎక్కువగా వాడుతుంటారు. గులాబీ రేకుల(rose petals)ను శతాబ్దాలుగా మూలికా వైద్యంలో ఉపయోగిస్తుండటం గమనార్హం. గులాబి రేకులతో అనేక అద్భుతమైన లాభాలేంటో ఇప్పుడు చూద్దాం..
గులాబీ రేకుల్లో కాల్షియం(Calcium), ఐరన్(Iron), విటమిన్ ఎ, సి, ఇ(Vitamin A, C, E) అధికంగా ఉంటాయి. వీటిలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు(Anti-inflammatory properties) జీర్ణక్రియ(digestion) ఆరోగ్యానికి మేలు చేయడమే కాకుండా బరువు తగ్గించడం(Weight loss)లో కూడా తోడ్పడుతుంది. గులాబి రేకుల్లో ఫైబర్ కంటెంట్(Fiber content) పుష్కలంగా ఉంటుంది. ఈ ఆకుల్ని రోజూ నిర్ణీత మోతాదులో తీసుకుంటే ఆకలి తగ్గి.. వెయిట్ లాస్‌కు దోహనం చేస్తుంది.
అలాగే ఈ గులాబి రేకుల్ని నూనెలో వేసి చేసి తలకు అప్లై చేయడం వల్ల మైండ్ కూల్ గా ఉంటుంది. జ్ఞాపకశక్తి(memory) పెరుగుతుంది. అంతేకాకుండా స్ట్రెస్(Stress) ను తగ్గించడంలో సహాయపడుతుంది. వీటిలో తయారు చేసిన కషాయం తాగితే చెడు కొలెస్ట్రాల్(bad cholesterol) తగ్గుతుంది. బాదం(almond) అండ్ గులాబీ రెక్కలు కలిపి రోజూ మర్నింగ్ తిన్నట్లైతే.. రక్తపోటు సమస్య దూరమవుతుంది. గుండె ఆరోగ్యా(heart health)నికి గులాబి బెస్ట్ ఔషధమని నిపుణులు చెబుతున్నారు.
గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. మీ అవగాహన కోసం నిపుణులు అందించిన సమాచారం మాత్రమే అందిస్తున్నాం. పై వార్తలో మీకు అనుమానాలు ఉంటే కనుక నిపుణులకు సంప్రదించగలరు.
Read More..
Winter: శీతాకాలంలో స్నానం ఎప్పుడు చేయాలి.. ఎలాంటి సోప్స్ వాడొద్దు..?