టైటాన్ ప్రమాదం.. గుర్తించేలోపే శరీర భాగాలు కాలి బూడిదయి..
టైటాన్ సబ్ మెరైన్ ప్రమాదానికి అసలు కారణం ఏంటో అధికారులు తెలిపారు.
దిశ,వెబ్‌డెస్క్: టైటానిక్ షిప్‌ను చూసేందుకు సముద్ర యాత్రకు వెళ్లి.. సబ్‌మెరైన్ ప్రమాద కారణంగా ఐదుగురు బిలియనేర్లు మరణించిన విషయం తెలిసిందే. ఈ యాత్ర ప్రపంచానికి తీవ్ర విషాదం మిగిల్చింది. టైటాన్ సబ్ మెరైన్ ప్రమాదానికి అసలు కారణం ఏంటో అధికారులు తెలిపారు. సముద్రం అడుగున నాలుగు కిలోమీటర్ల లోతులో అత్యధిక నీటి పీడనం కారణంగానే టైటాన్ పేలిపోయిందని అమెరికా అధికారులు తెలిపారు. ఈ ప్రమాదం జరుగుతోందని గుర్తించేలోగానే సబ్ మెరైన్ పేలిపోయి ఉంటుందని అంచనా వేశారు. ఆ ప్రమాదంలో సబ్‌మెరైన్ పేలి పోవడంతో వారు కాలిపోయి బూడిదయ్యారని అన్నారు. పూర్తి స్థాయిలో విషయం తెలుసుకోవడానికి టాటైన్ బాగాలను ఇంజినీర్లు పరిశీలిస్తున్నారు.
టైటాన్ 3.8 కిలోమీటర్ల లోతులో ఉన్నప్పుడు దానిపై నీటి బరువు పదివేల టన్నులకు సమానం. అప్పుడు సబ్‌మెరైన్ బద్దలైతే అది గంటకు దాదాపు 2,414 కి.మీ. వేగంతో లోపలికి కుచించుకుపోతుంది. అంటే సెకనుకు 671 మీటర్లు. అప్పుడు మిల్లీ సెకెన్ టైంలోనే టైటాన్ పూర్తిగా బద్దలైపోతుంది. ఆ పేలుడు దాటికి శరీరాలు కాలిపోయి తక్షణమే బూడిదగా మారిపోయి ఉంటాయనేది అధికారుల అంచనా.