రష్యా అధ్యక్షుడిని వారే చంపేస్తారు: జెలెన్ స్కీ సంచలన వ్యాఖ్యలు
రష్యా- ఉక్రెయిన్ వార్ ఏడాదిగా కొనసాగుతున్న వేళ జెలెన్ స్కీ పుతిన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు.
దిశ, వెబ్‌డెస్క్: రష్యా- ఉక్రెయిన్ వార్ ఏడాదిగా కొనసాగుతున్న వేళ జెలెన్ స్కీ పుతిన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను ఆయన సన్నిహితులే చంపేస్తారని జెలెన్ స్కీ అన్నారు. ఇయర్ పేరిట తీసిన డాక్యుమెంటరీలో ఆ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్ పై యుద్ధం పట్ల రష్యా అంతర్గత వర్గాలు తీవ్ర అసంతృప్తిలో ఉన్నాయని వస్తున్న వార్తలపై జెలెన్ స్కీ స్పందించారు.
పుతిన్ పాలనతో అక్కడి ప్రజలు విసిగిపోయిన రోజు ఓ కదిలిక వస్తుంది. సొంత ప్రజలే ఆయన్ను గద్దె దింపుతారు. కిల్లర్ ను హత్య చేయడానికి వారికొక రీజన్ దొరుకుతుంది. కచ్చితంగా అది ఎప్పుడనేది చెప్పలేను. పుతిన్‌ను ఆయన సన్నిహితులే చంపేస్తారని ఈ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. అని ఆ డాక్యుమెంటరీలో జెలెన్ స్కీ అన్నారు. రష్యా స్వాధీనం చేసుకున్న నగరాలను తిరిగి స్వాధీనం చేసుకుంటామని ఈ సందర్భంగా జెలెన్ స్కీ వ్యాఖ్యనించారు. కాగా ఈ ఫిబ్రవరి 24తో రష్యా - ఉక్రెయిన్ వార్ ఏడాది పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే.