షాకింగ్ ఘటన..ఆత్మహత్య చేసుకున్న రోబోట్..?

దక్షిణ కొరియాలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. అయితే ఇక్కడ రోబోలను విరివిగా వాడుతుంటారనే విషయం తెలిసిందే. కాలిఫోర్నియాకు చెందిన ఓ కంపెనీ తయారు చేసిన ఓ రోబోను 2023 అక్టోబరు నుంచి గుమి నగర కౌన్సిల్‌లో వినియోగిస్తున్నారు.

Update: 2024-07-04 09:10 GMT

దిశ,వెబ్‌డెస్క్: దక్షిణ కొరియాలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. అయితే ఇక్కడ రోబోలను విరివిగా వాడుతుంటారనే విషయం తెలిసిందే. కాలిఫోర్నియాకు చెందిన ఓ కంపెనీ తయారు చేసిన ఓ రోబోను 2023 అక్టోబరు నుంచి గుమి నగర కౌన్సిల్‌లో వినియోగిస్తున్నారు. ఈ క్రమంలో ఆఫీసులో సేవలందించే రోబోట్ దానంతట అదే మెట్లపై నుంచి దూకింది. ఈ ఘటనపై సోషల్ మీడియాలో వింత ప్రచారం జరుగుతుంది. కాగా, ఈ ఘటనపై అధికారులు ఏం చెబుతున్నారంటే..రోబో దానికదే మెట్లపై నుంచి కిందకి పడిందని, అంతకుముందు అయోమయంగా తిరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారని తెలిపారు.

దీంతో రోబో సూసైడ్ చేసుకున్నట్లు దక్షిణ కోరియా వాసులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ విచారం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి కేసు ఇదే తొలిసారంటూ కామెంట్ కూడా పెడుతున్నారు. కచ్చితమైన కారణాలు తెలుసుకునేందుకు రోబో ముక్కలను కంపెనీకి పంపినట్లు తెలిపారు. అయితే రోబోలు ఆత్మహత్యకు పాల్పడటం అసాధ్యమనే వాదనలూ వినిపిస్తున్నాయి. గతంలో వాషింగ్టన్‌లోనూ ఒక ఫౌంటెయిన్‌ వద్ద ఇదే రకంగా రోబో ధ్వంసమైంది. అప్పుడు కూడా రోబో ఆత్మహత్య చేసుకుందనే ప్రచారం జరిగింది. అయితే, అది జారిపడి ముక్కలైందని తర్వాత విచారణలో వెల్లడైంది.


Similar News