బ్రిటన్ ఎన్నికల్లో ఓడిపోయిన తెలంగాణ వ్యక్తులు వీరే..!

బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల ఫలితాలు అక్కడి ఎన్నికల్లో పోటీ చేసిన తెలంగాణ వాసులకు నిరాశను మిగిల్చాయి.

Update: 2024-07-05 12:31 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల ఫలితాలు అక్కడి ఎన్నికల్లో పోటీ చేసిన తెలంగాణ వాసులకు నిరాశను మిగిల్చాయి. ఇటీవల జరిగిన బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల ఫలితాలు శుక్రవారం వెళువడ్డాయి. ఈ ఎన్నికల్లో 14 ఏళ్ల నుంచి అధికారంలో ఉన్న కన్జర్వేటివ్ పార్టీ ని ఓడించి లేబర్ పార్టీ అధికారంలోకి వచ్చింది.ఇప్పటివరకు ప్రధానిగా ఉన్న రిషి సునాక్ పార్టీ 119 స్థానాలు సాధించగా.. లేబర్ పార్టీ 403 సీట్లు గెలుచుకొని భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. అయితే ఇందులో అక్కడ స్థిరపడిన తెలంగాణ వ్యక్తులు ఓటమి పాలయ్యారు. ఇందులో మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు దూరపు బందువు, అంతర్జాతీయ వక్త, రచయితగా పేరు పొందిన ఉదయ్ నాగరాజు, జనరల్ ప్రాక్టీషనర్ గా సేవలందిస్తు్న్న చంద్ర కన్నెగంటి లు ఓడిపోయారు.

కరీంనగర్ జిల్లా కోహెడ మండలం శనిగరం గ్రామానికి చెందిన నాగరాజు నార్త్ బెడ్‌ఫోర్డ్‌షైర్ స్థానం నుంచి లేబర్ పార్టీ తరుపున పోటీ చేసి ఓడిపోయారు. ఇందులో కన్జర్వేటీవ్ పార్టీకి చెందిన రిచర్డ్ పుల్లర్ కు 19,981 ఓట్లు సాధించగా.. నాగరాజుకు 14, 567 ఓట్లతో ఓటమి పాలయ్యారు. ఇక నిజమాబాద్ జిల్లా కోటగిరికి చెందిన చంద్ర కన్నెగంటి స్టోక్ ఆన్ ట్రెంట్ సెంట్రల్ స్థానం నుంచి కన్జర్వేటివ్ పార్టీ తరుపున పోటీ చేసి, 6,221 ఓట్లతో మూడో స్తానానికి పరిమితం అయ్యారు. కన్నెగంటి చంద్ర ఉన్నత విద్య కోసం లండన్ వెళ్లి జనరల్ ప్రాక్టిషనర్ గా సేవలందిస్తూనే రాజకీయాల్లోకి దిగారు. స్టోక్ ఆన్ ట్రెంట్ నుంచి చంద్ర రెండు సార్లు కౌన్సిలర్ గా, ఒక సారి మేయర్ గా పనిచేశారు.


Similar News