WWEకి నుంచి రిటైర్మెంట్ తీసుకున్న జాన్ సెనా

16-సార్లు WWE ఛాంపియన్ అయిన లెజెండ్ జాన్ సెనా రిటైర్మెంట్ ప్రకటించాడు.

Update: 2024-07-07 04:10 GMT

దిశ, వెబ్‌డెస్క్: 16-సార్లు WWE ఛాంపియన్ అయిన లెజెండ్ జాన్ సెనా రిటైర్మెంట్ ప్రకటించాడు. కెనడా వేదికగా జరుగుతున్న మనీ ఇన్ ది బ్యాంక్ పే పర్ వ్యూ లో పాల్గొన్న సెనా.. ప్రొఫెషనల్ రెజ్లింగ్‌లో తన చివరి సంవత్సరం 2025 అని వెల్లడించాడు. లాస్ వెగాస్‌లోని WWE రెసిల్‌మేనియాలో తన చివరి మ్యాచ్‌లో పాల్గొననున్నాడు. దానికంటే ముందు అతను ఈ సంవత్సరంలో మొట్టమొదటి RAW ఎపిసోడ్‌లో పాల్గొంటారు. వరల్డ్ రెజ్లింగ్ ఎంట్రటైన్ లో జాన్ సెనా దాదాపు 23 సంవత్సరాల సూపర్ స్టార్ గా పేరొందాడు. అతను WWE ఛాంపియన్‌షిప్‌ను 13 సార్లు, ప్రపంచ హెవీవెయిట్ టైటిల్‌ను మూడు వేర్వేరు సందర్భాలలో గెలుచుకున్నాడు. అలాగే WWE లో అత్యధిక టాప్ టైటిల్ విజయాలు అందుకు‌న్నప్లేయర్ గా నిలిచాడు. కాగా ప్రముఖ హాలీవుడ్ చిత్రాల్లో మొదట గెస్ట్ రోల్స్ చేసిన జాన్ సెనా.. ఇప్పుడు పూర్తి స్థాయిలో హీరోగా భారీ సినిమాల్లో నటిస్తున్నారు. ఈ క్రమంలోనే WWE రిటైర్మెంట్ ప్రకటించినట్లు తెలుస్తుంది.


Similar News