Iran: ఇరాన్ అధ్యక్ష పీఠాన్ని దక్కించుకున్న పెజెష్కియాన్

ఇరాన్ అధ్యక్ష ఎన్నికల్లో సంస్కరణవాదిగా పేరొందిన మసౌద్ పెజెష్కియాన్ గెలుపొందారు. ప్రధాన ప్రత్యర్థి సయీద్ జలీలీని ఓడించి అధ్యక్ష పీఠాన్ని దక్కించుకున్నారు.

Update: 2024-07-06 06:11 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఇరాన్ అధ్యక్ష ఎన్నికల్లో సంస్కరణవాదిగా పేరొందిన మసౌద్ పెజెష్కియాన్ గెలుపొందారు. ప్రధాన ప్రత్యర్థి సయీద్ జలీలీని ఓడించి అధ్యక్ష పీఠాన్ని దక్కించుకున్నారు. హెలికాప్టర్ ప్రమాదంలో ఇబ్రహీం రయీసీ చనిపోవడంతో.. ఇరాన్ కొత్త అధ్యక్షుడి కోసం ఎన్నికలు జరిగాయి. ఇకపోతే, జూన్ 28 న అధ్యక్ష ఎన్నికలు జరిగాయి. కాగా.. పెజెష్కియాన్, జలీలీ ఇద్దరికీ కావాల్సిన 50 శాతం మెజారిటీ రాలేదు. దీంతో శుక్రవారం మరోసారి పోలింగ నిర్వహించారు. మొత్తం 30 కోట్ల మంది ఓటు వేయగా.. పెజెష్కియాన్ కు 1.63 కోట్ల ఓట్లు పడ్డాయి. 1.35 కోట్ల మంది జలీలీకి అనుకూలంగా ఓటేశారు. గాజా యుద్ధంపై ప్రాంతీయ ఉద్రిక్తతలు, పాశ్చాత్య దేశాలపై ఆంక్షలతో ఇరాన్ ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయింది. ఇకపోతే, అణు ఒప్పందాన్ని పునరుద్ధరించడానికి పాశ్చాత్య దేశాలతో నిర్మాణాత్మక సంబంధాల కోసం పెజెష్కియాన్ పిలుపునిచ్చారు. కాగా.. ఆంక్షలు, ఆర్థిక కష్టాల నేపథ్యంలో ఆగ్రహంతో ఉన్న ప్రజలు ఈసారి పెజెష్కియన్కు పట్టం కట్టినట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News