శ్రీలంక నూతన అధ్యక్షుడు అనురకుమార దిసనాయకే
శ్రీలంక(Srilanka) అధ్యక్ష ఎన్నికల్లో మార్క్సిస్ట్ నేత అనురకుమార దిసనాయకే (Anurakumara Disanayake) విజయం సాధించారు.
దిశ, వెబ్ డెస్క్ : శ్రీలంక(Srilanka) అధ్యక్ష ఎన్నికల్లో మార్క్సిస్ట్ నేత అనురకుమార దిసనాయకే (Anurakumara Disanayake) విజయం సాధించారు. గత శనివారం ఓటింగ్ జరగగా.. నేడు ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టారు. తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఫలితం తెలకపోవడంతో.. రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కించగా.. అనురకుమారకు పూర్తి మెజారిటీ దక్కింది. దీంతో శ్రీలంక 9వ అధ్యక్షునిగా నేషనల్స్ పీపుల్స్ పవర్(NPV) అలయన్స్ కు చెందిన అనురకుమార దిసనాయకే ఎన్నికయ్యారు. ప్రస్తుతం శ్రీలంక ఆర్థిక వెనుకబాటు, విపరీతమైన అప్పులతో నిండిపోయింది. దీని నుండి నూతన అధ్యక్షునిగా ఎన్నికైన అనురకుమార దేశాన్ని ఎలా బయట పడేస్తారు అనేది ప్రపంచం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తోంది. పేదరిక నిర్మూలన, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాల కల్పన వంటి హామీలతో అనురకుమార ఎన్నికల ప్రచారం నిర్వహించగా.. శ్రీలంక ప్రజలు అనురకుమారకు పట్టం కట్టినట్టు తెలుస్తోంది.