ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కండోమ్
సురక్షిత శృంగారానికి..సంతానోత్పత్తి నియంత్రణకు గర్భ నిరోధక సాధనంగా వినియోగించే కండోమ్ ల తయారీలో కంపనీలు రకరకాల ఉత్పత్తులతో మార్కెట్లోకి వస్తున్నాయి.
దిశ, వెబ్ డెస్క్ : సురక్షిత శృంగారానికి..సంతానోత్పత్తి నియంత్రణకు గర్భ నిరోధక సాధనంగా వినియోగించే కండోమ్ ల తయారీలో కంపనీలు రకరకాల ఉత్పత్తులతో మార్కెట్లోకి వస్తున్నాయి. ఇందులో కొన్ని తక్కువ ధరకు దొరికితే మరికొన్నింటిని ఎక్కువ ధరలకు విక్రయిస్తున్నారు. చాల వరకు రూ. 10 లేదా రూ. 50రూపాయాలలో కండోమ్ ల అమ్మకాల సాగుతున్నాయి. అయితే 200 ఏళ్ల క్రితమే తయారైన ఓ కండోమ్ ఇప్పటిదాకా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కండోమ్ గా రికార్డు సాధించడం ఇప్పుడు వైరల్ గా మారింది. వేలంలో విక్రయించబడిన ఆ కండోమ్ ఏకంగా 460 పౌండ్లు.. అంటే ఇండియన్ కరెన్సీలో దాదాపుగా రూ. 44 వేలకు అమ్ముడైంది. 19 సెంటిమీటర్లు(7 అంగుళాలు) ఉన్న ఈ కండోమ్‌ను చూసి వేలంలో పాల్గొన్న వారు షాక్ అయ్యారట. 18వ లేదా 19వ శతాబ్దానికి చెందినదిగా గుర్తించబడిన ఈ పురాతన కండోమ్ ఆధునిక కాలం నాటి కండోమ్‌లకు భిన్నంగా తయారు చేశారు. దీనిని గొర్రెల పేగుల నుంచి తయారు చేయడం విశేషం. పూర్వం గొర్రెలు, పందులు, దూడలు, మేకలు వంటి జంతువుల పేగులతో కండోమ్‌లను తయారు చేసేవారు. అందుకే ఈ కండోమ్ చాలా ఖరీదైనదిగా నిలిచింది.
కొన్ని రోజుల క్రితం స్పెయిన్ లోని చిన్న నగరంలో ఒక పెట్టె దొరికింది. ఆ చిన్న పెట్టెలో ఏముందా అని తీసి చూస్తే కండోమ్ కనబడింది. 19సెంటిమీటర్ల ఆ కండోమ్ ని చూసి అందరూ షాకయ్యారు. దాన్ని ప్రయోగశాలలో టెస్ట్ చేస్తే అది 200సంవత్సరాల క్రితం నాటిది అని తెలిసింది. అదీగాక దాన్ని గొర్రె పేగుతో తయారు చేసినట్లు చెప్పారు. పురాతన కాలం నాటిది కావడంతో వెంటనే వేలానికి పిలిచారు. ఈ వేలానికి చాలామంది వచ్చారు. ఆన్ లైన్ వేదికగా జరిగిన ఈ వేలంలో చాలామంది పాల్గొన్నారు. చివరికి ఆమ్ స్టర్ డామ్ కి చెందిన వ్యాపారవేత్త ఆ కండోమ్ ని దక్కించుకున్నాడు. పురాతన కాలంనాటి కండోమ్స్ మ్యూజియంలో మాత్రమే కనిపిస్తాయి. అలాంటిది వేలంలో దక్కించుకున్నాడు. ప్రస్తుతం ఈ కండోమ్, ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కండోమ్ గా గుర్తింపు తెచ్చుకుంది. అప్పటి కాలం నాటి కండోమ్ లు కనీసం 15సెంటిమీటర్ల పొడవు ఉండేవని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.