అర్థరాత్రి పాక్ రేంజర్ల కవ్వింపు.. జవాన్‌ సహా ముగ్గురికి గాయాలు

పాకిస్తాన్ రేంజర్లు కవ్వింపు చర్యలకు దిగారు. గురువారం రాత్రి జమ్మూలోని అర్నియా సెక్టార్‌లో అంతర్జాతీయ సరిహద్దు వద్ద పాకిస్తాన్ రేంజర్లు మోర్టార్ షెల్స్తో భారత భూభాగంలోకి కాల్పులు జరిపినట్లు బీఎస్ఎఫ్ అధికారులు తెలిపారు.

Update: 2023-10-27 06:05 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: పాకిస్తాన్ రేంజర్లు కవ్వింపు చర్యలకు దిగారు. గురువారం రాత్రి జమ్మూలోని అర్నియా సెక్టార్‌లో అంతర్జాతీయ సరిహద్దు వద్ద పాకిస్తాన్ రేంజర్లు మోర్టార్ షెల్స్తో భారత భూభాగంలోకి కాల్పులు జరిపినట్లు బీఎస్ఎఫ్ అధికారులు తెలిపారు. వెంటనే అప్రమత్తమైన బీఎస్ఎఫ్ బలగాలు పాక్‌ కాల్పులకు దీటుగా బదులిచ్చాయి. గురువారం రాత్రి 8 గంటల సమయంలో పాకిస్తాన్ భూభాగం నుంచి కాల్పులు ప్రారంభమయ్యాయని తెల్లవారుజామున 3 గంటల వరకు ఈ కాల్పులు కొనసాగాయని అధికారులు తెలిపారు.

నివాస ప్రాంతాలపై మోర్టార్ షెల్స్‌తో దాడి చేయడంతో సమీపంలోని గ్రామాల్లో ఇళ్లు ధ్వంసం అయ్యాయి. గ్రామస్తులు తమ ఇళ్లను వదిలి పారిపోయారు. అనేక మంది రాత్రంతా బంకర్లలో గడిపారు. ఈ ఘటనలో ఒక బీఎస్ఎఫ్ జవాన్ సహా ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు.

Tags:    

Similar News