నౌకలపై దాడులు ఆపండి: హౌతీలకు అమెరికా వార్నింగ్

ఎర్రసముద్రంలో వాణిజ్య నౌకలపై దాడులకు పాల్పడుతున్న హౌతీ తిరుగుబాటుదారులకు అమెరికా సహా 12 మిత్ర దేశాలు హెచ్చరికలు జారీ చేశాయి.

Update: 2024-01-04 05:03 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఎర్రసముద్రంలో వాణిజ్య నౌకలపై దాడులకు పాల్పడుతున్న హౌతీ తిరుగుబాటుదారులకు అమెరికా సహా 12 మిత్ర దేశాలు హెచ్చరికలు జారీ చేశాయి. నౌకలపై దాడులు వెంటనే ఆపేయాలని లేదంటే సైనిక చర్యను ఎదుర్కోవాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చాయి. ఈ మేరకు ఓ సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. దీనిపై యూఎస్, ఆస్ట్రేలియా, బహ్రెయిన్, బెల్జియం, కెనడా, డెన్మార్క్, జర్మనీ, ఇటలీ, జపాన్, నెదర్లాండ్స్, న్యూజిలాండ్, సింగపూర్, బ్రిటన్ దేశాలు సంతకాలు చేశాయి. ‘యెమన్‌కు చెందిన హౌతీలు నౌకలపై దాడులను నిలిపివేయాలి. చట్టవిరుద్ధంగా నిర్భందించిన నౌకలు, సిబ్బందిని వెంటనే విడుదల చేయాలి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసే జలమార్గాల్లో బెదిరింపులకు గురి చేయడం సరికాదు. కాబట్టి అటాక్స్ వెంటనే ఆపకపోతే తర్వత జరిగే పరిణామాలకు హౌతీలే బాధ్యత వహించాలి’ అని పేర్కొన్నాయి. కాగా, హౌతీల ఇటీవల ఎర్ర సముద్రంలో సుమారు 23నౌకలపై దాడులకు పాల్పడిన విషయం తెలిసిందే. దీంతో రెడ్‌సీలో ఉద్రిక్త వాతారణం నెలకొనగా.. పలు దేశాలు భద్రతను పెంచాయి. ఈ క్రమంలోనే తాజాగా హౌతీలకు హెచ్చరికలు జారీ చేయడం గమనార్హం. 

Tags:    

Similar News