ట్రంప్‌పై కాల్పులకు ఉపయోగించిన వెపన్ ఇదే.. వెలుగులోకి సంచలన విషయాలు..!

అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌పై హత్యాయత్నం అగ్రరాజ్యంలో సంచలంగా మారింది. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ట్రంప్ గుర్తు

Update: 2024-07-14 04:27 GMT

దిశ, వెబ్‌డెస్క్: అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌పై హత్యాయత్నం అగ్రరాజ్యంలో సంచలంగా మారింది. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ట్రంప్ గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో బుల్లెట్ చెవికి రాసుకుంటూ వెళ్లడంతో ట్రంప్ తృటిలో ప్రాణపాయం నుండి బయటపడ్డాడు. ట్రంప్‌పై దాడితో ఆయన భద్రతా సిబ్బంది వెంటనే అలర్ట్ అయ్యి ఒక నిందితుడిని స్పాట్‌లోనే కాల్చి చంపారు. ట్రంప్‌పై మర్డర్ అటెంప్ట్ నేపథ్యంలో అమెరికాలో హై అలర్ట్ ప్రకటించారు. పెన్సిల్వేనియా బట్లర్‌లో ట్రంప్‌పై దాడి జరిగిన ప్రాంతాన్ని అమెరికా సీక్రెట్‌ సర్వీస్ చుట్టుముట్టాయి.

ఆ ప్రాంతంలోని బిల్డింగ్‌లను తమ ఆధీనంలోకి తీసుకుని ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నాయి. సీక్రెట్ సర్వీస్ విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. AR-15 సెమీ ఆటోమేటిక్ రైఫిల్‌తో ట్రంప్‌పై కాల్పులు జరిపినట్లు భద్రతా దళాలు నిర్ధారించాయి. ట్రంప్‌కు 182 మీటర్లు దూరం నుండి ఫైరింగ్ జరిపినట్లు గుర్తించారు. ఎన్నికల ప్రచారం కోసం ఏర్పాటు చేసిన సభావేదికకు ఎదురుగా ఉన్న ఎత్తైన ప్రదేశం నండి కాల్పులు జరిపిన దుండగుడు.. మొత్తం ఆరు రౌండ్ల కాల్పులు జరిపినట్లు వెల్లడించారు. ట్రంప్ ఘటనపై విచారణను అమెరికా సీక్రెట్ సర్వీసెస్ స్పీడప్ చేశాయి. 


Similar News