సంచలన పరిణామం.. ఇజ్రాయెల్ దాడుల్లో హమాస్ చీఫ్ హతం

ఇజ్రాయెల్, హమాస్ యుద్ధంలో సంచలన పరిణామం చోటు చేసుకుంది. ఇజ్రాయెల్ చేసిన భీకర దాడిలో హమాస్ చీఫ్ యాహ్యా సిన్వార్ మృతి చెందాడు.

Update: 2024-10-17 17:20 GMT

దిశ, వెబ్ డెస్క్: ఇజ్రాయెల్, హమాస్ యుద్ధంలో సంచలన పరిణామం చోటు చేసుకుంది. ఇజ్రాయెల్ సైన్యం చేసిన దాడిలో హమాస్ చీఫ్ యాహ్యా సిన్వార్ మృతి చెందినట్లు తెలుస్తుంది. ఈ నెల 7న తాము చేసిన దాడిలో హమాస్ చీఫ్ యాహ్యా సిన్వార్ హతం అయినట్లు ఇజ్రాయెల్ ప్రకటిచింది. కాగా గాజా స్ట్రిప్‌లో జరిగిన ఆపరేషన్‌లో మరణించిన ముగ్గురు ఆపరేటివ్‌లలో ఇజ్రాయెల్ యొక్క మోస్ట్ వాంటెడ్ శత్రువు అయిన సిన్వార్ కూడా ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో ఇజ్రాయెల్ సైన్యం యాహ్యా సిన్వార్ హత్యను ధృవీకరించింది.

ఇదిలా ఉంటే కాల్పులు జరిపిన ప్రాంతంలో సైన్యానికి దొరికిన దంతాలు, చిత్రాలను పోలీసు ఫోరెన్సిక్స్ ల్యాబ్‌కు సమర్పించామని, డీఎన్‌ఏ పరీక్ష కొనసాగుతోందని ఇజ్రాయెల్ పోలీసులు, మిలటరీ గురువారం సంయుక్త ప్రకటనలో తెలిపారు. ఈ ప్రక్రియలు పూర్తయిన తర్వాత సిన్వార్ మృతి పై క్లారిటీ వస్తుందని వారు తెలిపారు. గాజాలో ఇజ్రాయెల్ జరిపిన ఆపరేషన్‌లో సిన్వార్ మరణించినట్లు సూచనలు సూచిస్తున్నాయని హమాస్ వర్గాలు అంటున్నాయి. కానీ ఆయన మృతిపై హమాస్ ఎటువంటి ప్రకటన చేయలేదు.


Similar News