మాస్కో : రష్యా ప్రైవేట్ ఆర్మీ ‘వాగ్నర్ గ్రూప్’ చీఫ్ ప్రిగోజిన్ అనుమానాస్పద మరణంపై కీలక విషయం వెలుగుచూసింది. రష్యా ఆర్మీపై తిరుగుబాటు చేసిన ప్రిగోజిన్‌ను హతమార్చేందుకు అధ్యక్షుడు పుతిన్ సన్నిహితుడైన రష్యా సెక్యూరిటీ అధికారి నికొలాయ్ పత్రుషెవ్ ప్లాన్ చేశారంటూ.. అంతర్జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. ప్రిగోజిన్ ప్రయాణిస్తున్న ప్రైవేటు విమానం రెక్క కింద బాంబు పెట్టి కూల్చేశారని వాటిలో పేర్కొన్నారు. పుతిన్ అధ్యక్షుడు అయినప్పటి నుంచి నికొలాయ్ ఆయన దగ్గరే పనిచేస్తూ, రష్యాలో శక్తివంతమైన నేతగా చలామణి అవుతున్నారని తెలిపారు. ఈ కథనాలను క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ ఖండించారు. అవన్నీ కట్టుకథలని వెల్లడించారు.