రష్యా ఓడరేవుపై ఉక్రెయిన్‌ డ్రోన్‌ దాడి..

తొలిసారిగా రష్యాకు చెందిన నోవోరోసిస్క్‌ ఓడరేవు వద్దనున్న ఆర్మీ షిప్స్‌పై ఉక్రెయిన్‌ డ్రోన్‌ దాడికి పాల్పడింది.

Update: 2023-08-04 10:54 GMT

మాస్కో : తొలిసారిగా రష్యాకు చెందిన నోవోరోసిస్క్‌ ఓడరేవు వద్దనున్న ఆర్మీ షిప్స్‌పై ఉక్రెయిన్‌ డ్రోన్‌ దాడికి పాల్పడింది. ఈ దాడి నేపథ్యంలో పోర్టులో కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేశారు. దాడి జరిగిన విషయాన్ని నోవోరోసిస్క్‌ ఓడరేవులో క్రూడ్ ఆయిల్ టర్మినల్‌ను నిర్వహించే కాస్పియన్‌ పైప్‌లైన్‌ కన్సార్టియం వెల్లడించింది. నోవోరోసిస్క్‌ ఎమర్జెన్సీ సర్వీసు బృందాలు కూడా ఈ ఘటనను ధ్రువీకరించాయి.

నల్లసముద్రంలో రష్యా ఎగుమతులకు ఈ పోర్టు అత్యంత కీలకమైంది. ఈ పోర్టులోనే కాస్పియన్‌ పైప్‌లైన్‌ కన్సార్టియం.. క్రూడ్ ఆయిల్‌ను ట్యాంకర్లలో నింపుతుంటుంది. క్రూడ్ ఆయిల్ షిప్స్‌కు రక్షణగా ఉన్న ఆర్మీ షిప్స్‌పై ఉక్రెయిన్ డ్రోన్ దాడి చేసిందని రష్యా ప్రభుత్వం వెల్లడించింది. ఈ దాడిని తమ సైన్యం తిప్పికొట్టిందని, ఉక్రెయిన్ డ్రోన్‌ను పేల్చేసిందని చెప్పింది. ఇటీవల క్రిమియాపైకి వచ్చిన 10 ఉక్రెయిన్ డ్రోన్లను కూడా తాము కూల్చేశామని పేర్కొంది.


Similar News