రష్యా ఉక్రెయిన్ వార్ : 13వేల మంది ఉక్రెయిన్ సోల్జర్స్ మృతి
రష్యా ఉక్రెయిన్ వార్ లో తమ దేశానికి చెందిన 13 వేల మంది మృతి చెందినట్లు అధ్యక్షుడు జెలెన్ స్కీ సలహాదారు మైఖైలో తెలిపారు.
దిశ, వెబ్ డెస్క్: రష్యా ఉక్రెయిన్ వార్ లో తమ దేశానికి చెందిన 13 వేల మంది మృతి చెందినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ సలహాదారు మైఖైలో తెలిపారు. తొమ్మిది నెలలుగా రష్యా ఉక్రెయిన్ జరుగుతుండగా ఈ మరణాల సంఖ్య అంచనాలను మించి ఉండవచ్చని భావిస్తున్నారు. అమెరికా మాత్రం లక్షమంది రష్యా, లక్షమంది ఉక్రెయిన్ సైనికలు, 40 వేల మంది పౌరులు చనిపోయినట్లు తెలిపింది. ఐరోపా కమిషన్ అధిపతి ఉర్సులా వొన్ డెర్ లెయెన్ బుధవారం మాట్లాడుతూ.. లక్ష మంది ఉక్రెయిన్ సైనికులు మరణించారని వెల్లడించారు. దాదాపు 20 వేల మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. కాగా తమ బలగాలను ఉక్రెయిన్ నుంచి ఉపసంహరించుకునే విషయంలో రష్యా కఠినంగానే వ్యవహరిస్తోంది. చర్చలకు మా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సిద్ధంగా ఉన్నారు. అయినప్పటికీ ఉక్రెయిన్ లో మా దళాలను ఉపసంహరించుకోవాలన్న పశ్చిమ దేశాల డిమాండ్ అంగీకార యోగ్యం కాదని క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ తెలిపారు.