చట్టప్రకారమే ఆ మ్యాప్ విడుదల చేశాం : చైనా

భారత్‌కు చెందిన అరుణాచల్‌ప్రదేశ్‌, అక్సాయ్‌ చిన్‌లను తమ దేశ మ్యాప్‌లో ఆగస్టు 28న కలిపేసుకున్న చైనా.. దాన్ని సమర్ధించుకుంటూ కారు కూతలు కూసింది.

Update: 2023-08-30 14:35 GMT

బీజింగ్ : భారత్‌కు చెందిన అరుణాచల్‌ప్రదేశ్‌, అక్సాయ్‌ చిన్‌లను తమ దేశ మ్యాప్‌లో ఆగస్టు 28న కలిపేసుకున్న చైనా.. దాన్ని సమర్ధించుకుంటూ కారు కూతలు కూసింది. ఇదంతా తమ దేశ చట్ట ప్రకారమే జరిగిందంటూ తన చర్యను ఏకపక్షంగా సమర్థించుకుంది. ఆ వివాదాస్పద మ్యాప్‌పై భారత్ అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వాంగ్ వెన్ బిన్ బుధవారం ఘాటుగా స్పందించారు.

‘చట్టప్రకారం చైనా తన సార్వభౌమ అధికారాన్ని ప్రదర్శించే సర్వ సాధారణ ప్రక్రియల్లో భాగంగానే ఆ మ్యాప్‌ను విడుదల చేసింది. అభ్యంతరాలను వ్యక్తం చేసే వాళ్లు మమ్మల్ని అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాం. మ్యాప్‌పై అనవసర భాష్యాలు చెప్పడం ఆపేస్తారని ఆశిస్తున్నాం’ అని ఆయన వ్యాఖ్యానించారు. అంతకుముందు దీనిపై స్పందించిన భారత్.. సరిహద్దు వివాదాన్ని రగిల్చేందుకే ఈ మ్యాప్‌ను చైనా విడుదల చేసిందని మండిపడింది.


Similar News