Hezbollah: దక్షిణ లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడి.. మరో హిజ్బుల్లా కమాండర్ హతం

లెబనాన్ రాజధాని బీరూట్‌పై దాడి చేసిన గంటల వ్యవధిలోనే ఇజ్రాయెల్ దళాలు దక్షిణ లెబనాన్‌పై విరుచుకుపడ్డాయి.

Update: 2024-10-11 16:08 GMT

దిశ, నేషనల్ బ్యూరో: లెబనాన్ రాజధాని బీరూట్‌పై దాడి చేసిన గంటల వ్యవధిలోనే ఇజ్రాయెల్ దళాలు దక్షిణ లెబనాన్‌పై విరుచుకుపడ్డాయి. మీస్ ఎల్ జబల్ ప్రాంతంలో వైమానిక దాడులు చేపట్టాయి. ఈ ఘటనలో హిజ్బుల్లాతో సంబంధం ఉన్న మరో సీనియర్ కమాండర్‌ను హతమార్చినట్టు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్ఏ) తెలిపింది. హిజ్బుల్లా రద్వాన్ ఫోర్సెస్ యాంటీ ట్యాంక్ క్షిపణి యూనిట్‌లోని కీలక హిజ్బుల్లా మిలిటెంట్ అరేబ్ ఎల్ షోగా మృతి చెందినట్టు వెల్లడించింది. ఎల్ షోగా ఉత్తర ఇజ్రాయెల్‌ను లక్ష్యంగా చేసుకుని అనేక క్షిపణి దాడులను నిర్వహించినట్టు పేర్కొంది. ఆయన మృతితో దక్షిణ లెబనాన్‌లో హిజ్బుల్లా సైనిక సామర్థ్యాలకు గట్టి ఎదురుదెబ్బ తగిలిందని తెలిపింది. అలాగే ఐడీఎఫ్ దళాలకు సమీపంలో ఉన్న భవనంలో పనిచేస్తున్న ఉగ్రవాదులపై దాడులు నిర్వహించింది. ఈ ప్రాంతంలో అనేక ఆయుధాలు గుర్తించినట్టు ఐడీఎఫ్ తెలిపింది. అంతకుముందు బీరూట్ పై జరిపిన దాడుల్లో 22 మంది మృతి చెందగా, 117 మంది గాయపడ్టట్టు లెబనాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. 


Similar News