అతని ఒక్కడినే విమర్శించడం అన్యాయం : Harbhajan Singh

Update: 2023-07-10 15:11 GMT

దిశ, వెబ్‌డెస్క్: డుబ్ల్యూటీసీ ఫైనల్‌లో ఆస్ట్రేలియా చేతిలో టీమ్​ఇండియా ఓటమిపాలైన విషయం తెలిసిందే. 209 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా చేతిలో టీమ్​ఇండియా ఘోర పరాజయం చెందింది. వరుసగా రెండో సారి ఫైనల్‌కు చేరి ఓడిపోవడంతో పలువురు మాజీలు కెప్టెన్ రోహిత్ శర్మపై విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో రోహిత్‌కు మాజీ ప్లేయర్ ​హర్భజన సింగ్​ మద్దతుగా నిలిచాడు. రోహిత్‌కు సపోర్ట్​ ఇస్తే మంచి నిర్ణయాలు తీసుకుంటాడని బీసీసీఐకి విజ్ఞప్తి చేశాడు. అక్టోబర్‌లో వన్డే ప్రపంచకప్‌ ఉన్నందున.. బీసీసీఐ.. రోహిత్‌కు అన్ని రకాలుగా మద్దతుగా నిలవాల్సిన అవసరం ఉందని భజ్జీ అభిప్రాయం వ్యక్తం చేశాడు. అప్పుడే అతడు కెప్టెన్‌గా సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోగలడని అన్నాడు.

''క్రికెట్ అనేది ఒక టీమ్​ఆట. ఒక్క ప్లేయర్​జట్టును ఉన్నతస్థాయిలో నిలబెట్టలేడు. డబ్ల్యూటీసీ ఫైనల్‌లో టీమ్ఇండియా బాగా రాణించలేదు. కానీ, ఒక్క రోహిత్‌ శర్మనే విమర్శించడం అన్యాయం. అతడు అద్భుతమైన కెప్టెన్‌. ఇటీవల వచ్చిన ఫలితాల ఆధారంగా అతడి కెప్టెన్సీపై ఓ అంచనాకు రావడం సరైనది కాదు. రోహిత్‌ మళ్లీ రాణిస్తాడు. అతడిపై విశ్వాసం ఉంచి మద్దతుగా నిలవాల్సిన అవసరం ఉంది. బీసీసీఐ నుంచి సపోర్ట్‌ ఉంటే రోహిత్​స్వేచ్ఛగా పని చేసుకోవచ్చ'' అని హర్భజన్‌ సింగ్ అన్నాడు.


Similar News