యువరాణి కేట్‌కు ఏదైనా జరిగి ఉంటుంది.. డయానా సోదరుడి సంచలన కామెంట్స్
దిశ, నేషనల్ బ్యూరో : బ్రిటన్ యువరాజు ప్రిన్స్ విలియమ్స్ సతీమణి, యువరాణి కేట్ మిడిల్‌టన్ (42) దాదాపు గత రెండున్నర నెలలుగా రాజభవనం నుంచి బయటకు రాలేదు.
దిశ, నేషనల్ బ్యూరో : బ్రిటన్ యువరాజు ప్రిన్స్ విలియమ్స్ సతీమణి, యువరాణి కేట్ మిడిల్‌టన్ (42) దాదాపు గత రెండున్నర నెలలుగా రాజభవనం నుంచి బయటకు రాలేదు. దీంతో ఆమె ఏమయ్యారు ? ఆమెకు ఏం జరిగింది ? అనే దానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. పొట్ట భాగంలో శస్త్రచికిత్స జరగడం వల్ల కేట్ విశ్రాంతి తీసుకుంటున్నారని.. అందుకే రాజభవనం నుంచి బయటకు రాలేకపోతున్నారని బ్రిటన్ రాయల్ ఫ్యామిలీ చెబుతోంది. ప్రిన్స్ విలియమ్స్ తల్లి ప్రిన్సెస్ డయానా 1997లో 36 ఏళ్ల చిన్న వయసులో అనుమానాస్పద స్థితిలో ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. తాజాగా కేట్ మిడిల్‌టన్ వ్యవహారంపై డయానా సోదరుడు 59 ఏళ్ల చార్లెస్ స్పెన్సర్ స్పందించారు. కేట్ మిడిల్‌టన్‌కు ఏమై ఉంటుందో అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కేట్ పొట్టకు సర్జరీ జరిగిందని ఈ ఏడాది జనవరి నుంచి రాయల్ ఫ్యామిలీ చెబుతున్న వాదన నమ్మదగిన విధంగా లేదన్నారు. ఇన్ని నెలలు గడిచినా యువరాణి కేట్ ప్యాలెస్ బయటకు రాకపోవడం అనుమానాలకు తావిస్తోందని చార్లెస్ స్పెన్సర్ కామెంట్ చేశారు. ‘‘1997లో సంభవించిన డయానా మరణాన్ని గుర్తు చేసుకుంటే.. చాలా బాధగా అనిపిస్తుంది. అలా ఎవ్వరికీ జరగకూడదని కోరుకుంటున్నా’’ అని ఆయన పరోక్షంగా కేట్ మిడిల్‌టన్ మిస్సింగ్ వ్యవహారాన్ని ప్రస్తావించారు.