త్వరలోనే దేశంలో సిగరెట్లు బ్యాన్.. సంచలన నిర్ణయం దిశగా ప్రధాని అడుగులు..?

బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ సంచలన నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. బ్రిటన్‌లో సిగరెట్లను బ్యాన్ చేయాలని రిషి సునాక్ ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లుగా పలు బ్రిటిష్ మీడియా సంస్థలు కథనాల్లో పేర్కొన్నాయి.

Update: 2023-09-23 09:21 GMT

దిశ, వెబ్‌డెస్క్: బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ సంచలన నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. బ్రిటన్‌లో సిగరెట్లను బ్యాన్ చేయాలని రిషి సునాక్ ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లుగా పలు బ్రిటిష్ మీడియా సంస్థలు కథనాల్లో పేర్కొన్నాయి. యూకేలో ధూమపాన నిరోధక చర్యలు చేపట్టాలని సునాక్ ప్రభుత్వం భావిస్తోందని అక్కడి ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. 2009 జనవరి 1వ తేదీ లేదా ఆ తర్వాత జన్మించిన వారికి పొగాకు అమ్మడంపై నిషేధం విధిస్తూ న్యూజిలాండ్ ప్రభుత్వం గతేడాది చట్టం చేసిన సంగతి తెలిసిందే. అదే విధమైన చట్టాన్ని బ్రిటన్‌లో తీసుకురావాలని రిషి సునాక్ ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.

ఈ చట్టం ద్వారా యువత, విద్యార్థులకు సిగరెట్లను విక్రయించకుండా.. 2030 నాటికి బ్రిటన్‌ను ధూమపాన రహిత దేశంగా మార్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని అధికారులు పేర్కొన్నారు. ఇక, ధూమపాన కట్టడి చర్యల్లో భాగంగా ఉచిత వేవ్ కిట్లు పంపిణీ చేయాలని ఆ దేశ ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. ప్రమాదకరమైన ఈ-సిగరెట్ల నియంత్రణ చర్యల్లో భాగంగా పిల్లలకు ఉచితంగా వేవ్ కిట్ల పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటామని ఇప్పటికే బ్రిటన్ ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. 

Tags:    

Similar News