US మాజీ ప్రెసిడెంట్ ట్రంప్‌పై కాల్పులు.. ప్రధాని మోడీ కీలక ట్వీట్
అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌పై జరిగిన కాల్పుల ఘటనపై ప్రధాని మోడీ స్పందించారు. ట్రంప్ త్వరగా కోలుకోవాలని ట్విట్టర్ వేదికగా
దిశ, వెబ్‌డెస్క్: అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌పై జరిగిన కాల్పుల ఘటనపై ప్రధాని మోడీ స్పందించారు. ట్రంప్ త్వరగా కోలుకోవాలని ట్విట్టర్ వేదికగా మోడీ ఆకాంక్షించారు. ‘‘నా స్నేహితుడు, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై జరిగిన దాడి పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాను. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నా. రాజకీయాల్లో, ప్రజాస్వామ్యంలో హింసకు స్థానం లేదు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా’’ అని ప్రధాని ట్వీట్ చేశారు. కాగా, ఆదివారం పెన్సిల్వేనియా రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న ట్రంప్‌పై గుర్తు తెలియని దండగులు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఈ దాడిలో బుల్లెట్ తగిలి ట్రంప్ చేవికి గాయం కాగా ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. కాగా, ఈ ఏడాది నవంబర్‌లో అగ్రరాజ్యంలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. రిపబ్లికన్ పార్టీ నుండి ట్రంప్, డెమోక్రటిక్ నుండి జో బైడెన్ బరిలోకి దిగుతున్నారు. ఈ క్రమంలో మాజీ అధ్యక్షుడు, ప్రస్తుతం ప్రెసిడెంట్ ఎలక్షన్ రేసులో ఉన్న ట్రంప్‌పై కాల్పులు జరగడంతో అమెరికా ఒక్కసారిగా ఉలిక్కిపడింది.