ఇజ్రాయెల్ దాడిని ఎదుర్కొనేందుకు సిద్ధం: ఇరాన్
ఇజ్రాయెల్ చేసే ఎటువంటి దాడినైనా ఎదుర్కోవడానికి తమ సైన్యం సిద్ధంగా ఉందని ఇరాన్ ప్రకటించింది. ఇరాన్ ఆర్మీ డే సందర్భంగా బుధవారం నిర్వహించిన కవాతులో ఆదేశ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ప్రసంగించారు.
దిశ, నేషనల్ బ్యూరో: ఇజ్రాయెల్ చేసే ఎటువంటి దాడినైనా ఎదుర్కోవడానికి తమ సైన్యం సిద్ధంగా ఉందని ఇరాన్ ప్రకటించింది. ఇరాన్ ఆర్మీ డే సందర్భంగా బుధవారం నిర్వహించిన కవాతులో ఆదేశ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ప్రసంగించారు. రష్యా తయారు చేసిన సుఖోయ్-24లతో సహా ఎటువంటి యుద్ధ విమానాలనైనా ఎదుర్కునేందుకు ఇరాన్ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ఇరాన్‌పై ఇజ్రాయెల్ చేసే ఏ అటాక్‌కైనా తీవ్రమైన ప్రతిస్పందన ఉంటుందని హెచ్చరించారు. ఎయిర్ కవరేజ్, బాంబర్స్ సహా అన్ని రంగాల్లో ఇరాన్ సైన్యం ముందుందని, ఎటువంటి ఆపరేషన్‌కైనా వెనుకాడబోమని తేల్చి చెప్పారు. మరోవైపు ఇరాన్ నౌకాదళం వాణిజ్య నౌకలను ఎర్ర సముద్రం వద్దకు తీసుకువెళుతున్నట్లు అడ్మిరల్ షహ్రామ్ ఇరానీ తెలిపారు. ఇతర దేశాల నౌకలను రక్షించడానికి ఇరాన్ రెడీగా ఉందని వెల్లడించారు. కాగా, ఇరాన్‌పై తప్పకుండా దాడి చేస్తామని ఇజ్రాయెల్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ప్రపంచ దేశాలన్ని ఆందోళన చెందుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇరాన్ అధ్యక్షుడి వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.