ఇమ్రాన్ ఖాన్ ఇంటి వద్దకు భారీగా చేరుకున్న పోలీసు బలగాలు
పాకిస్థాన్ మాజీ ప్రధాని, తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ పార్టీ చీఫ్ ఇమ్రాన్ ఖాన్ ఇంటికి భారీగా పోలీసు బలగాలు చేరుకున్నాయి.
దిశ, వెబ్‌డెస్క్: పాకిస్థాన్ మాజీ ప్రధాని, తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ పార్టీ చీఫ్ ఇమ్రాన్ ఖాన్ ఇంటికి భారీగా పోలీసు బలగాలు చేరుకున్నాయి. కాగా తొషఖానా కేసులో నిన్న ఇస్లామాబాద్ కోర్టు పాక్ మాజీ ప్రధానిని అరెస్ట్ చేయాలని సూచించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జమాన్ పార్క్ లోని ఇమ్రాన్ ఖాన్ ఇంటికి పెద్ద సంఖ్యలో పోలీసులు చేరుకున్నారు.
సీనియర్ పోలీసు అధికారి మాట్లాడుతూ.. పోలీసులు ఇమ్రాన్ ఖాన్ ను అరెస్ట్ చేసేందుకు వచ్చారన్నారు. ఇమ్రాన్ ఇంటి సమీపంలో పీటీఐ వర్కర్లు జమాన్ పార్క్ వద్ద మాల్ రోడ్డును బ్లాక్ చేశారు. సాయుధ పోలీసులు పీటీఐ సపోర్టర్లపై టియర్ గ్యాస్, వాటర్ కెనాన్లను ప్రయోగించి వారిని అడ్డు తొలగించారు. ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు ఈ సందర్భంగా పోలీసులపై రాళ్లు రువ్వారు. పీటీఐ అఫిషియల్ ట్విట్టర్ అకౌంట్ లో మద్దుతుదారులు, వర్కర్స్ సంయమనం పాటించాలని కోరింది.