PM Modi Meets president Biden In US: అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ తో.. ప్రధాని మోదీ భేటీ!

భారత ప్రధాని(India PM) నరేంద్ర మోదీ(Narendra Modi) 3 రోజుల పర్యటన నిమిత్తం అమెరికా(US) చేరుకున్నారు.

Update: 2024-09-22 02:43 GMT

దిశ, వెబ్ డెస్క్: భారత ప్రధాని(PM) నరేంద్ర మోదీ(Narendra Modi) 3 రోజుల పర్యటన నిమిత్తం అమెరికా(US) చేరుకున్నారు. క్వాడ్ శిఖరాగ్ర సదస్సులో భాగంగా అమెరికా వెళ్ళిన ప్రధాని మోదీ.. యూఎస్ ప్రెసిడెంట్(US President) జో బైడెన్(Joe Biden) తో భేటీ అయ్యారు. బైడెన్ నివాసం అయిన డెలావర్(Delaware home) లో ఇద్దరు నేతలు సమావేశమై.. ద్వైపాక్షిక, అంతర్జాతీయ అంశాలు, భారత్- యూఎస్ వ్యూహాత్మక భాగస్వామ్యం తదితర అంశాల పై చర్చించారు. దీంతో పాటు ముఖ్యంగా రష్యా(Russia), ఉక్రెయిన్(Ukraine) మధ్య జరుగుతున్న యుద్ధం గురించి ప్రస్తావించారు. జో బైడెన్ తో భేటీ అనంతరం.. చర్చలు సఫలమైనట్లు సోషల్ మీడియా వేదికగా ప్రధాని మోదీ 'ఎక్స్'(X) లో ప్రకటించారు.

తర్వాత జో బైడెన్ ఈ భేటీ గురించి మాట్లాడుతూ.. భారత్ తో యూఎస్ భాగస్వామ్యం అనేది చరిత్రలో ఎప్పుడూ లేనంత బలమైందని ఆయన తెలిపారు. భారత్, యూఎస్ దేశాల మధ్య భాగస్వామ్యం అత్యంత స్నేహపూర్వకమైనదని, చైతన్యంతో కూడినది అని బైడెన్ అన్నారు. అంతేకాకుండా మోదీతో భేటీ అయిన ప్రతిసారీ ఇరుదేశాలకు సంబంధించిన కొత్త అంశాలపై చర్చిస్తున్నట్లు ఈ సందర్భంగా బైడెన్ వెల్లడించారు.


Similar News