George Soros: జార్జి సోరోస్ కు అమెరికా అత్యున్నత పురస్కారం.. మస్క్ విమర్శలు
బిలియనీర్ ఫైనాన్షియర్ జార్జి సోరోస్‌ను(Billionaire philanthropist George Soros) అమెరికా అత్యుత్తమ పురస్కారం.. ప్రెసిడెంట్ మెడల్ ఆఫ్ ఫ్రీడంతో సత్కరించనున్నారు.
దిశ, నేషనల్ బ్యూరో: బిలియనీర్ ఫైనాన్షియర్ జార్జి సోరోస్‌ను(Billionaire philanthropist George Soros) అమెరికా అత్యుత్తమ పురస్కారం.. ప్రెసిడెంట్ మెడల్ ఆఫ్ ఫ్రీడంతో సత్కరించనున్నారు. అయితే, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్(US President Joe Biden) నిర్ణయంపై టెస్లా అధినేత ఎలాన్ మస్క్(Tesla CEO Elon Musk) ఫైర్ అయ్యారు. సోరస్ కు బైడెన్ అత్యున్నత పురస్కారంతో సత్కరించడం హాస్యాస్పదం అని అన్నారు. అంతేకాకుండా డార్త్ సిడియోస్ అనే చెత్త క్యారక్టర్‌తో పోలుస్తూ ఓ మీమ్‌ను మస్క్ ఎక్స్‌లో పోస్టు చేశారు. ‘ఇక్కడ జార్జి సోరస్ చూడటానికి బాగున్నారు’ అన్న ట్యాగ్ ని జతచేశారు. ఇకపోతే, అమెరికా అధ్యక్షుడు బైడెన్ 19 మందికి ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ప్రీడమ్ అవార్డుని ఇస్తున్నట్లు ప్రకటించారు. రాజకీయాలు, దాతృత్వం, క్రీడలు, కళలకు సంబంధించిన 19 మంది వ్యక్తుల పేర్లను వెల్లడించారు. అందులో, జార్జి సోరోస్ కూడా ఉన్నారు. అంతేకాకుండా, అవార్డు గ్రహీతలలో మాజీ విదేశాంగ కార్యదర్శి హిల్లరీ క్లింటన్, ఫుట్‌బాల్ లెజెండ్ లియోనెల్ మెస్సీ, యాక్టర్స్ మైఖేల్ జే ఫాక్స్, డెంజెల్ వాషింగ్టన్ ఉన్నారు.
రిపబ్లికన్ల విమర్శలు
ఇప్పటికే, సోరస్ తీరుపై మస్క్ పలు మార్లు బహిరంగంగానే విమర్శలు చేశారు. మరోవైపు రిపబ్లికన్ పార్టీ నేతలు కూడా బైడెన్ సర్కారు నిర్ణయాన్ని తప్పుబట్టారు. అమెరికా చరిత్రపై మరో చెంపదెబ్బ అని పేర్కొన్నారు. జాతీయ విలువలకన్నా రాజకీయ అజెండాకే బైడెన్ ప్రాధాన్యమిచ్చారన్నారు. ఈ మేరకు నిక్కీ హేలీ ఎక్స్‌లో పోస్టు చేశారు. సోరస్ తన సంపదను ప్రపంచ రాజకీయాలను ప్రభావితం చేయడానికి వినియోగిస్తారని కొన్నేళ్లుగా రిపబ్లికన్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు. బిలియనీర్ ఫైనాన్షియర్, ఓపెన్ సొసైటీ ఫౌండేషన్స్ (Open Society Foundations) ద్వారా మానవ హక్కుల పరిరక్షణ కోసం పలు కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రస్తుతం 70కిపైగా దేశాల్లో ఈ సంస్థ కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్లు సమాచారం. ఆ దేశ రాజకీయాల్లో జోక్యం చేసుకొంటుందనే తీవ్ర విమర్శలు ఈ సంస్థపై ఉన్నాయి. గతంలో భారత ప్రధాని నరేంద్ర మోడీపైన కూడా జార్జి సోరోస్ విమర్శలు గుప్పించారు.