Kathmandu: నేపాల్ లో విమానానికి త్రుటిలో తప్పిన ప్రమాదం

నేపాల్ లో విమానానికి త్రుటిలో ప్రమాదం తప్పింది. బుద్ధ ఎయిర్‌లైన్స్‌ విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయడంతో అందరూ ఊపరిపీల్చుకున్నారు.

Update: 2025-01-06 08:26 GMT

దిశ, నేషనల్ బ్యూరో: నేపాల్ లో విమానానికి త్రుటిలో ప్రమాదం తప్పింది. బుద్ధ ఎయిర్‌లైన్స్‌ విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయడంతో అందరూ ఊపరిపీల్చుకున్నారు. సిబ్బంది సహా 76 మందితో బుద్ధ ఎయిర్ లైన్స్ విమానం నేపాల్‌ రాజధాని కాట్మండు(Kathmandu)లోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయం (Tribhuvan International Airport) నుంచి భద్రాపూర్‌కు బయల్దేరింది. అయితే, విమానం గాల్లోకి ఎగిరిన కాసేపటికే సాంకేతిక సమస్య తలెత్తింది. ఎడమవైపు ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన పైలట్‌ ఈ విషయాన్ని వెంటనే అధికారులకు తెలియజేశారు. ఆ తర్వాత ఫ్లైట్ ని త్రిభువన్‌ ఎయిర్‌పోర్ట్‌కు మళ్లించి అక్కడ సేఫ్‌గా ల్యాండ్‌ చేశారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

స్పందించిన బుద్ధ ఎయిర్ లైన్స్

నేపాల్ విమానంపై బుద్ధ ఎయిర్ లైన్స్ స్పందించింది. విమానం ఇంజిన్‌లో సాంకేతిక సమస్య తలెత్తినట్లు వివరించింది. ‘ఇంజిన్‌లో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో విమానాన్ని తిరిగి కాట్మండు ఎయిర్‌పోర్ట్‌కు మళ్లించాం. ఉదయం 11:15 గంటలకు త్రిభువన్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్‌ అయ్యింది. సాంకేతిక బృందం విమానాన్ని తనిఖీ చేస్తోంది. మరో విమానంలో ప్రయాణికులను భద్రాపూర్‌కు పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం’ అని బుద్ధ ఎయిర్‌లైన్స్‌ ఎక్స్‌ వేదికగా తెలిపింది.

Tags:    

Similar News