PM Modi : మేక్ ఇన్ ఇండియా, మేక్ ఫర్ ది వరల్డ్ కార్యక్రమంలో పాలుపంచుకోండి.. పోలిష్ కంపెనీలకు మోడీ పిలుపు

భారత ప్రధాని నరేంద్ర మోడీ రెండు రోజుల పర్యటన నిమిత్తం పోలాండ్ దేశం వెళ్లిన సంగతి తెలిసిందే.

Update: 2024-08-22 21:53 GMT

దిశ, వెబ్‌డెస్క్: భారత ప్రధాని నరేంద్ర మోడీ రెండు రోజుల పర్యటన నిమిత్తం పోలాండ్ దేశం వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో   ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi)   పోలాండ్ ప్రధాని డొనాల్డ్ టస్క్ (Donald Tusk) తో గురువారం భేటీ అయ్యారు. పోలాండ్‌లో తన మైలురాయి పర్యటన సందర్భంగా.. 'మేక్ ఇన్ ఇండియా, మేక్ ఫర్ ది వరల్డ్' కార్యక్రమంలో పాలుపంచుకోవాలని పోలిష్ కంపెనీలకు మోడీ పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా మోడీ మాట్లాడూతూ.. "నా స్నేహితుడు డొనాల్డ్ టస్క్ ని కలిసినందుకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు. నూతన సాంకేతికతలు అలాగే ఆహార ప్రాసెసింగ్, పట్టణ మౌలిక సదుపాయాల వంటి రంగాలలో బలోపేతం అవ్వడానికి ఇరు దేశాల మధ్య అంగీకారం కుదిరినట్లు ప్రధాని మోదీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X లో పోస్ట్ చేశారు.

పోలాండ్ ప్రధాని డొనాల్డ్ టస్క్ మాట్లాడుతూ.. రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి 70 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రధాని మోదీకి ఆతిథ్యమివ్వడం గొప్ప విశేషమని, మోడీ పోలాండ్ పర్యటన వల్ల ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు మెరుగవుతాయని చెప్పడానికి నాకు ఎటువంటి నిస్సందేహంగా లేదని డొనాల్డ్ టస్క్ తెలిపారు. 1979లో మొరార్జీ దేశాయ్ పోలాండ్‌ను సందర్శించిన తర్వాత 45 ఏళ్లలో భారత ప్రధాని పోలాండ్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. తన రెండు దేశాల పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ శుక్రవారం ఉక్రెయిన్‌లో పర్యటించనున్నారు.మోడీ శుక్రవారం సాయంత్రం ఉక్రెయిన్‌కు రైలులో బయలుదేరనున్నాడు. రష్యా-ఉక్రెయిన్ మధ్య తీవ్ర యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో మోడీ ఉక్రెయిన్ పర్యటనకు వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది. 

Tags:    

Similar News