Lawrence Bishnoi gang:గ్యాంగ్ స్టర్ హత్య.. ప్రతీకారం తీర్చుకున్నామన్న బిష్ణోయ్ గ్యాంగ్
అమెరికా (USA)లో మోస్ట్ వాంటెడ్ డ్రగ్ స్మగ్లర్ సునీల్ యాదవ్ (Drugs smuggler Sunil Yadav) హత్యకు జరిగింది. అయితే, ఆ హత్యకు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ బాధ్యత వహించింది.
దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా (USA)లో మోస్ట్ వాంటెడ్ డ్రగ్ స్మగ్లర్ సునీల్ యాదవ్ (Drugs smuggler Sunil Yadav) హత్యకు జరిగింది. అయితే, ఆ హత్యకు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ బాధ్యత వహించింది. రెండ్రోజుల క్రితం జరిగిన ఈ ఘటన తమ పనేనంటూ ఈ గ్యాంగ్ సోషల్ మీడియాలో ప్రకటించుకుంది. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందిన గ్యాంగ్‌స్టర్లు గోల్డీ బ్రార్, రోహిత్ గొడారా ఈ హత్యకు పాల్పడ్డారు. కాగా.. వీరు అమెరికా కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ఈ ఘటనపై బ్రార్ ఫేస్‌బుక్‌లో పోస్టు పెట్టాడు. సునీల్ పంజాబ్ పోలీసులతో కుమ్మక్కయ్యాడని ఆరోపించాడు. తమ సోదరుడు అంకిత్ భాడు ఎన్ కౌంటర్ లో పంజాబ్ పోలీసులకు సునీల్ సాయం చేశాడని అన్నాడు. అందుకే ప్రతీకారం తీర్చుకున్నామని పేర్కొన్నాడు. ఎన్ కౌంటర్ తర్వాత అందులో ప్రమేయం ఉందని వెలుగులోకి వచ్చిన మరుక్షణమే సునీల్ అమెరికా పారిపోయాడని పోస్టులో చెప్పుకొచ్చాడు. అన్నారు.
సునీల్ యాదవ్ ఎవరంటే?
కాలిఫోర్నియాలోని స్టాక్‌టన్ ఏరియాలో ఉన్న సునీల్ ఇంట్లోకి దూసుకెళ్లి లారెన్స్ షూటర్లు సునీల్‌ను చంపివేశారు. సునీల్ యాదవ్ పేరుమోసిన స్మగ్లర్. పాకిస్థాన్ ద్వారా భారత్‌లోకి డ్రగ్స్ సప్లయ్ చేసేవాడు. కొన్నేళ్ల క్రితం రూ. 300 కోట్ల విలువైన డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్న కేసులో అతని పేరు బయటపడింది. ఇకపోతే, సునీల్ యాదవ్‌ది పంజాబ్‌లోని ఫజిల్కా. నకిలీ పాస్‌పోర్ట్‌తో అధికారులను బురిడీ కొట్టించి, రెండు సంవత్సరాల క్రితమే దేశం దాటాడు. రాహుల్ పేరుమీద అమెరికాకు ఎగిరిపోయాడు. యూఎస్, దుబాయ్ అంతటా అంతర్జాతీయ డ్రగ్ స్మగ్లింగ్‌లో సునీల్ ప్రమేయం ఉందని పోలీసు వర్గాలు వెల్లడించాయి. రాజస్థాన్ పోలీస్ విభాగం ఇదివరకే అతడిపై రెడ్‌కార్నర్ నోటీస్ జారీ చేసింది. సునీల్ యాదవ్ ఇంతకుముందు దుబాయిలో నివసించాడు. రాజస్థాన్ పోలీసులు అతన్ని అక్కడ అరెస్టు చేసి తిరిగి తీసుకువచ్చారు. రాజస్థాన్‌లోని గంగానగర్ జిల్లాలో ఆభరణాల వ్యాపారి పంకజ్ సోని హత్య కేసులో కూడా సునీల్ నిందితుడుగా ఉన్నారు. కాగా.. ఆ కేసులో అరెస్టయిన సునీల్ బెయిల్ పైన విడుదలయ్యాడు.