నెపోలియన్‌ సూసైడ్‌కు వాడుదామనుకున్న తుపాకీ వేలం.. ఏ రేటుకు ?

దిశ, నేషనల్ బ్యూరో : ఫ్రెంచ్‌ చక్రవర్తి నెపోలియన్‌ బోనాపార్టే 1814 ఏప్రిల్‌ 12న ఆత్మహత్య చేసుకోవాలని భావించారు.

Update: 2024-07-08 19:08 GMT

దిశ, నేషనల్ బ్యూరో : ఫ్రెంచ్‌ చక్రవర్తి నెపోలియన్‌ బోనాపార్టే 1814 ఏప్రిల్‌ 12న ఆత్మహత్య చేసుకోవాలని భావించారు. అందుకోసం ఓ పిస్తోల్‌ను కూడా రెడీ చేసుకున్నారు. అయితే ఆత్మహత్య ఆలోచనను బోనాపార్టే విరమించుకున్నారు. ఆనాడు సూసైడ్ కోసం నెపోలియన్‌ వాడుదామని భావించిన పిస్తోల్ సహా మరో తుపాకీని, వాటి యాక్సెసరీస్‌ను ఫ్రాన్స్‌లోని బ్లూఫౌంటేన్‌ ప్యాలెస్‌ పక్కనున్న ఓసెనాట్‌ ఆక్షన్‌ హౌస్‌లో వేలం వేశారు. ఆ రెండు పిస్తోళ్లు, నెపోలియన్ వినియోగించిన పలు వస్తువులను వేలం వేస్తే దాదాపు రూ.15 కోట్ల దాకా వచ్చాయి. ఈ తుపాకులను ఫ్రాన్స్‌ ప్రభుత్వం ఇటీవలే జాతీయ సంపదగా ప్రకటించింది. కొత్త గైడ్ లైన్స్ ప్రకారం.. నెపోలియన్‌కు చెందిన తుపాకులు, ఇతర వస్తువులను ఎవరైనా వేలంలో కొన్నా 30 నెలల్లోగా వాటిని ఫ్రాన్స్ ప్రభుత్వం తిరిగి కొనుగోలు చేస్తుంది. ఈ తుపాకులకు ఎందుకంత ప్రాధాన్యం అంటే.. వాటి తయారీలో బంగారం, వెండిని వాడారు. నెపోలియన్‌ వాడిన తుపాకులను లూయిస్‌ మెరైన్‌ గోస్సెట్‌ అనే కంపెనీ తయారుచేసింది. నెపోలియన్‌ 1821లో మరణించారు. అనంతరం అవి నెపోలియన్‌ సైనికాధికారి కుటుంబానికి వారసత్వంగా లభించాయి.


Similar News