ఇదెక్కడి విడ్డూరం రా నాయనా.. టూరిస్ట్‌తో పెళ్లి, ఆపై విడాకులు..

వివాహం అనేది చాలా పవిత్రమైన బంధం. ఈ బంధంతో అబ్బాయి, అమ్మాయి జీవితాంతం కలిసి జీవించాలని, ఒక కుటుంబాన్ని ప్రారంభించాలని వాగ్దానం చేసుకుంటారు.

Update: 2024-10-06 15:58 GMT

దిశ, వెబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డెస్క్ : వివాహం అనేది చాలా పవిత్రమైన బంధం. ఈ బంధంతో అబ్బాయి, అమ్మాయి జీవితాంతం కలిసి జీవించాలని, ఒక కుటుంబాన్ని ప్రారంభించాలని వాగ్దానం చేసుకుంటారు. కొన్ని వివాహ సంబంధాలలో సమస్యలను ఎదుర్కొన్న తర్వాత, జంటలు విడాకులు తీసుకుంటారు. విడాకులతో ఇద్దరూ విడిపోతారు. అయితే ఇండోనేషియాలో ప్లెజర్ మ్యారేజ్ అనే ఆచారం నడుస్తుందని తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. ఇంతకీ ఈ ఆచారం ఏంటి అనుకుంటున్నారా.. ఏం లేదండి ఇక్కడ సెలవులకు వచ్చే పర్యాటకులు వివాహం చేసుకుని విడాకులు తీసుకుంటారు. ఈ వివాహం గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.

ఆనంద వివాహం అంటే ఏమిటి ?

తూర్పు ఇండోనేషియాలోని పూనక్ అనే ప్రదేశం పర్యాటకులకు చాలా ప్రసిద్ధి చెందింది. ఇది కొండ ప్రాంతం కాబట్టి ఈ ప్రాంతాన్ని ప్రజలు చాలా ఇష్టపడతారు. చాలా మంది అరబ్బులు ఇక్కడికి వస్తుంటారు. ఈ ప్రదేశంలో కోట బుంగా అనే పర్వత రిసార్ట్ ఉంది. ఇక్కడ మగ పర్యాటకులు స్థానిక, యువతులకు ఏజెన్సీల ద్వారా పరిచయం చేస్తారు. తర్వాత మగ పర్యాటకుడు, స్త్రీ మధ్య ప్లెజర్ మ్యారేజ్ ఏర్పాటు చేస్తారు.

ఈ స్వల్పకాలిక వివాహం కోసం, పర్యాటకులు స్థానిక మహిళలకు డబ్బు చెల్లిస్తారు. వారిని పెయిడ్ వధువులు అని పిలుస్తారు. ఆ తర్వాత చిన్నపాటి వేడుకలో ఇద్దరూ పెళ్లి చేసుకుంటారు. ఈ వివాహం స్వల్పకాలికమైనందున, ఇది పర్యాటకుడు దేశంలో ఉండే వరకు మాత్రమే ఉంటుంది. పర్యాటకుడు దేశం విడిచి పెట్టిన తర్వాత, ఇద్దరూ విడాకులు తీసుకుంటారు.

ఆర్థిక వ్యవస్థలో వృద్ధి..

లాస్ ఏంజిల్స్ టైమ్స్‌లోని ఒక నివేదిక ప్రకారం ఈ వివాహాన్ని ఆనంద వివాహం అని పిలుస్తారు. ఈ వివాహం వల్ల ఒకవైపు పర్యాటకం ఊపందుకోగా, మరోవైపు ఆర్థిక వ్యవస్థలో కూడా వృద్ధి కనిపిస్తోంది. ఇంతకు ముందు కుటుంబాలు ఈ పద్ధతి కోసం అమ్మాయిలను పర్యాటకులకు పరిచయం చేసేవి, కానీ ఇప్పుడు దీని కోసం ఏజెన్సీలు ఏర్పడ్డాయి.

"15 సార్లు వివాహం"

కేవలం 17 సంవత్సరాల వయస్సులో స్వల్పకాలిక వివాహం చేసుకున్న ఒక మహిళ తన కథను చెప్పింది. మిడిల్ ఈస్ట్ నుంచి వచ్చిన టూరిస్టులను ఇప్పటి వరకు 15 సార్లు పెళ్లి చేసుకున్నట్లు ఆ మహిళ తెలిపింది. ఆమె మొదటి వివాహం 50 ఏళ్ల సౌదీ అరేబియా టూరిస్ట్‌తో జరిగింది. ఆ సమయంలో మహిళ వయస్సు (17) సంవత్సరాలు.

ఆ టూరిస్ట్ ఆ మహిళకు ఆనంద వివాహం కోసం రూ.71,425 ఇచ్చాడని తెలిపింది. అయితే స్థానిక మహిళలకు స్వల్పకాలిక భర్తలు ఇచ్చే డబ్బులో ఏజెంట్‌కు కూడా వాటా ఉంది. ఏజెంట్ కు వాటా ఇవ్వడంతో మహిళ వద్ద రూ.35,712 మిగిలింది. వివాహం జరిగిన ఐదు రోజులకే, సౌదీ పర్యాటకుడు తన దేశానికి తిరిగి వెళ్లాడు. ఆ జంట విడాకులు తీసుకున్నారు.

పేదరికం..

ఇప్పటి వరకు 25 వేలు, 42 వేలు భోగ వివాహాలు చేసుకున్నట్లు స్థానిక మహిళ తెలిపింది. ఇంట్లో వయస్సు మీదపడిన తాతయ్యలు ఉన్నారు. ఈ డబ్బుతో ఆమె తన ఇంటిని నడుపుతుంది. తాతలను చూసుకుంటుందని తెలిపింది. ఇదే విధమైన కథను మరొక మహిళ వివరించింది.

ఇప్పటి వరకు తనకు 20 పెళ్లిళ్లు అయ్యాయని నిసా అనే మహిళ తెలిపింది. అయితే ఇప్పుడు నిసా ఈ పద్ధతిని వదిలేసి ఇండోనేషియా వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారని తెలిపింది.

చట్టం..

ఈ స్వల్పకాలిక వివాహాన్ని ముతా నికాహ్ అని పిలుస్తారు. ఇది షియా ముస్లింల సంప్రదాయంలో చేర్చారు. అయినప్పటికీ, షియా ముస్లింలతో సహా ఇస్లామిక్ పండితులు ఈ ఆచారానికి వ్యతిరేకంగా ఉన్నారు. దీనిని అనైతికంగా భావిస్తారు. అలాగే, ఇండోనేషియా చట్టం ఈ ఆనందకరమైన వివాహాన్ని చెల్లుబాటు అయ్యేదిగా పరిగణించదు. ఇండోనేషియా వివాహ చట్టాలను ఉల్లంఘిస్తే జరిమానాలు, జైలు శిక్షలు విధిస్తారు.


Similar News