రష్యా ఉపగ్రహం ముక్కలు..ఐఎస్ఎస్‌లో కలకలం!

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్‌)లో కలకలం రేగింది. 2022లో రష్యా ప్రయోగించి వదిలేసిన రెసర్స్-పీ1 అనే ఉపగ్రహం ముక్కలైనట్టు యూఎస్ స్పేస్ ఏజెన్సీలు తెలిపాయి.

Update: 2024-06-27 17:52 GMT

దిశ, నేషనల్ బ్యూరో: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్‌)లో కలకలం రేగింది. 2022లో రష్యా ప్రయోగించి వదిలేసిన రెసర్స్-పీ1 అనే ఉపగ్రహం ముక్కలైనట్టు యూఎస్ స్పేస్ ఏజెన్సీలు తెలిపాయి. రాత్రిపూట కక్ష్యలో 100 కంటే ఎక్కువ శిధిలాలుగా ఉపగ్రహం విడిపోయినట్టు తెలుస్తోంది. దీంతో ఐఎస్ఎస్ లోని వ్యోమగాములు అత్యవసరంగా సుమారు గంటసేపు సురక్షిత ప్రాంతంలో ఆశ్రయం పొందాల్సి వచ్చిందని పేర్కొంది. బుధవారం ఉదయం 10 గంటలకు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి సమీపంలోని కక్ష్యలో ఈ ఘటన జరిగిందని స్పేస్ కమాండ్ తెలిపింది. సాయంత్రం 6 గంటల వరకు ఉపగ్రహం అనేక శకలాలను విడుదల చేసింది. యూఎస్ స్పేస్ ట్రాకింగ్ సంస్థ లియోల్యాబ్స్‌కు చెందిన రాడార్లు దీనిని గుర్తించాయి. అయితే శాటిలైట్ ముక్కలవ్వడానికి గల కారణాలు వెల్లడించలేదు. దీని వల్ల ఇతర ఉపగ్రహాలకు ఎటువంటి ప్రమాదం లేదని, ఆందోళణ చెందాల్సిన అవసరం స్పేస్ కమాండ్ పేర్కొంది. కక్ష్యలో పెద్ద శిధిలాలు-ఉత్పత్తి సంఘటనలు చాలా అరుదు, అయితే ఉపయోగంలో లేని ఉపగ్రహ నెట్‌వర్క్‌లతో అంతరిక్షం రద్దీగా మారడం ఆందోళన కలిగిస్తుంది.


Similar News