ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో 10% కోత పెట్టేందుకు ప్లాన్ చేస్తున్న పాకిస్తాన్..

పాకిస్తాన్ ప్రభుత్వ ప్రస్తుతం తీవ్ర సంక్షోబంలో కొట్టు మిట్టాడుతుంది. పాక్‌లో తినే ఆహారం మొదలుకొని అన్ని వస్తువల రేట్లు భారీగా పెరిగిపోయాయి.

Update: 2023-01-26 04:23 GMT

దిశ, వెబ్‌డెస్క్: పాకిస్తాన్ ప్రభుత్వ ప్రస్తుతం తీవ్ర సంక్షోబంలో కొట్టు మిట్టాడుతుంది. పాక్‌లో తినే ఆహారం మొదలుకొని అన్ని రేట్లు భారీగా పెరిగిపోయాయి. విదేశీ మారకద్రవ్య నిల్వలు క్షీణించడం వల్ల ప్రస్తుత సంక్షోభం ఏర్పడింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో ప్రజలపై టాక్స్ భారం తగ్గించడానికి పాక్ ప్రభుత్వం విఫల ప్రయత్నాలు చేస్తుంది. అయినప్పటికి అది సాధ్యం కావట్లేదు.

దీంతో పాకిస్తాన్ ప్రభుత్వ పాలనకు నిధులు లేక కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగుల జీతాలను 10% తగ్గించడంతోపాటు దేశ ఆర్థిక ఇబ్బందులను అధిగమించే ప్రణాళికలను పాకిస్తాన్ ప్రభుత్వం పరిశీలిస్తోంది. జాతీయ పొదుపు కమిటీ కూడా మంత్రిత్వ శాఖల వ్యయాలను 15% తగ్గించి, సమాఖ్య మంత్రులు, రాష్ట్ర మంత్రుల సంఖ్యను తగ్గించడానికి పరిశీలిస్తున్నట్లు పాక్ మీడియా విశ్లేషకులు చెబుతున్నారు.


Similar News