Apple: యాపిల్ సంస్థకు భారీ షాక్.. 95 బిలియన్ డాలర్లు చెల్లించేందుకు రెడీ..!

యాపిల్‌ (Apple) సంస్థకు షాక్ తగిలింది. ఐఫోన్‌ వినియోగదారులపై నిఘా వేసినందుకు భారీగా పరిహారం చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Update: 2025-01-03 06:22 GMT

దిశ, బిజినెస్: యాపిల్‌ (Apple) సంస్థకు షాక్ తగిలింది. ఐఫోన్‌ వినియోగదారులపై నిఘా వేసినందుకు భారీగా పరిహారం చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ‘హే సిరి’ యాక్టివేట్‌ చేసినట్లు ఐదేళ్ల క్రితం దాఖలైన వ్యాజ్యాన్ని సెటిల్‌ చేసుకొనేందుకు యాపిల్‌ ఇప్పుడు 95 మిలియన్‌ డాలర్లు (సుమారు రూ.814 కోట్లు) చెల్లించేందుకు రెడీ అయ్యింది. ఈమేరకు ఇటీవల కాలిఫోర్నియాలోని ఓక్లాండ్‌ కోర్టులో ప్రతిపాదనలను దాఖలు చేసింది. వర్చువల్ అసిస్టెంట్‌ను యాక్టివేట్‌ చేసే కీలకమైన ‘హే సిరి’ వంటివి వినియోగదారులు పలక్కపోయినా.. అది యాక్టివేట్‌ అయి మాటలను రికార్డు చేసేదని వినియోదగారుడు పిటిషన్ లోఆరోపించారు. వీటిల్లో కొన్ని సంభాషణలను వాణిజ్య ప్రకటనలు జారీ చేసేవారితో షేర్‌ చేసుకొనేదని పేర్కొన్నారు. దీన్ని వాడుకునే వారు ప్రొడక్ట్‌లు విక్రయించేవారని అందులో వెల్లడించారు. పిటిషన్ ప్రకారం వినియోగాదారుల వ్యక్తిగత గోప్యతను కాపాడతామన్న యాపిల్‌ హామీలకు ఇది పూర్తి భిన్నంగా ఉంది. దీనిపై విచారణ ఫిబ్రవరి 14న విచారణ జరగనుంది. ఇక ఈ సెటిల్మెంట్‌ ఆమోదం పొందితే 2014 సెప్టెంబర్‌ 17 నుంచి యాపిల్‌ ఐఫోన్లు వాడుతున్న లక్షలాది మంది క్లెయిమ్‌లు దాఖలు చేసుకునే ఛాన్స్ కూడా ఉంది.

తప్పుచేసినట్లు అంగీకరించని యాపిల్

ఇకపోతే, ఈ సెటిల్మెంట్‌ సందర్భంగా యాపిల్‌ తాము తప్పు చేసినట్లు ఎక్కడా అంగీకరించలేదు. ప్రతి వినియోగదారుడు అత్యధికంగా 20 డాలర్ల వరకు పొందే అవకాశం ఉంది. క్లెయిమ్‌ ఆధారంగా ఈ చెల్లింపులు కొంత పెరగొచ్చు.. లేదా తగ్గొచ్చు. కానీ, మొత్తం 3 నుంచి 5 శాతంలోపు వినియోగదారులు మాత్రమే క్లెయిమ్‌ చేసుకోవచ్చు. అంతేకాదు.. ఒక్కొక్కరు కేవలం ఐదు డివైజ్‌లకు సంబంధించి మాత్రమే క్లెయిమ్‌లు చేయవచ్చు.

Tags:    

Similar News