ఆప్ఘనిస్థాన్‌లో పాక్ వైమాణిక దాడులు: 8 మంది మృతి

ఆప్ఘనిస్థాన్‌లో పాక్ సైన్యం సోమవారం వైమాణిక దాడులకు పాల్పడింది. ఈ దాడుల్లో 8 మంది మరణించినట్టు తాలిబన్ ప్రభుత్వ ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ తెలిపారు.

Update: 2024-03-18 08:13 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఆప్ఘనిస్థాన్‌లో పాక్ సైన్యం సోమవారం వైమాణిక దాడులకు పాల్పడింది. ఈ దాడుల్లో 8 మంది మరణించినట్టు తాలిబన్ ప్రభుత్వ ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ తెలిపారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, ఆరుగురు పిల్లలు ఉన్నట్టు వెల్లడించారు. పాక్ సరిహద్దుకు సమీపంలోని పక్వీకా ప్రావీన్సుల్లో పాక్ దాడులకు పాల్పడిందని పేర్కొన్నారు. ఈ అటాక్స్‌ను తీవ్రంగా ఖండిస్తున్నట్టు చెప్పారు. ఇవి తమ సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించడమేనని అభివర్ణించారు. ఇటీవల పాక్ భూభాగంలోనూ దాడులు జరగగా ఏడుగురు పాక్ సైనికులు మరణించారు. దీనికి తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటామని ఆ దేశ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్ధారీ ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే అప్ఘన్ భూభాగంపై పాక్ దాడులకు పాల్పడటం గమనార్హం.

2021లో తాలిబన్ ప్రభుత్వం అధికారాన్ని చేపట్టినప్పటి నుంచి పాక్, ఆప్ఘనిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. ఆప్ఘన్‌లోని ఉగ్రవాదులు తరచూ తమపై దాడులకు పాల్పడుతున్నాయని పాక్ ఆరోపిస్తున్నది. అలాగే పాక్ లో ఉన్న తెహ్రీక్-ఈ-తాలిబన్ వంటి ఉగ్రవాద సంస్థలు ఆప్ఘన్ సరిహద్దుల్లో పనిచేస్తున్నాయి. 2022లోనూ పాక్ దాడి చేయగా 47 మంది చనిపోయినట్టు తాలిబన్లు ప్రకటించారు. దీంతో రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Tags:    

Similar News