ఉక్రెయిన్ సరిహద్దులో న్యూక్లియర్ డ్రిల్స్: రష్యా సైన్యానికి పుతిన్ ఆదేశాలు

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఉక్రెయిన్ సరిహద్దులో ఉన్న దళాలతో అణ్వాయుధ కసరత్తులు నిర్వహించాలని తమ సైన్యాన్ని ఆదేశించారు.

Update: 2024-05-06 09:01 GMT

దిశ, నేషనల్ బ్యూరో: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఉక్రెయిన్ సరిహద్దులో ఉన్న దళాలతో అణ్వాయుధ కసరత్తులు నిర్వహించాలని తమ సైన్యాన్ని ఆదేశించారు. ఈ విషయాన్ని ఆ దేశ రక్షణ మంత్రిత్వ శాఖ సోమవారం వెల్లడించింది. ‘విన్యాసాల సమయంలో, వ్యూహాత్మక అణ్వాయుధాల తయారీ, వాటిని ఎలా వినియోగించాలనే దానిపై ప్రాక్టీస్ ఉంటుందని తెలిపింది. ‘రష్యన్ ఫెడరేషన్ సాయుధ దళాల సుప్రీం కమాండర్-ఇన్-చీఫ్ ఆదేశాల మేరకు యుద్ధ కార్యకలాపాలను నిర్వహిస్తాం. దీంతో నాన్-స్ట్రాటజిక్ అణు దళాల సంసిద్ధతను పెంచడం వీలవుతుంది’ అని తెలిపింది.

పశ్చిమ దేశాల నుండి బెదిరింపులు రావడంతోనే దీనికి ప్రతిస్పందనగా పుతిన్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టం చేసింది. ఈ కసరత్తుల్లో రష్యన్ ఎయిర్ ఫోర్స్, నావికాదళం పాల్గొననున్నట్టు పేర్కొంది. అయితే అణ్వాయుధాల విన్యాసాలు ఎప్పటి నుంచి నిర్వహిస్తారనే విషయం వెల్లడించలేదు. మరోవైపు ఉక్రెయిన్‌లో రెండో అతిపెద్ద నగరమైన ఖార్కివ్‌పై రష్యా తాజాగా జరిపిన డ్రోన్ దాడుల్లో ఒకరు మృతి చెందగా, 24 మంది గాయపడ్డారు.

Tags:    

Similar News