కొత్త న్యూక్లియర్ వార్‌హెడ్‌లను ఆవిష్కరించిన ఉత్తర కొరియా
ఉత్తర కొరియా కొత్త, చిన్న అణు వార్‌హెడ్‌లను ఆవిష్కరించింది. దీంతో పాటు మరిన్ని ఆయుదాలను అలాగే. ఆయుధాగారాన్ని విస్తరించడానికి మరిన్ని ఆయుధ-గ్రేడ్ అణు పదార్థాలను ఉత్పత్తి చేస్తామని ప్రతిజ్ఞ చేసింది.
దిశ, వెబ్‌డెస్క్: ఉత్తర కొరియా కొత్త, చిన్న అణు వార్‌హెడ్‌లను ఆవిష్కరించింది. దీంతో పాటు మరిన్ని ఆయుదాలను అలాగే. ఆయుధాగారాన్ని విస్తరించడానికి మరిన్ని ఆయుధ-గ్రేడ్ అణు పదార్థాలను ఉత్పత్తి చేస్తామని ప్రతిజ్ఞ చేసింది. కాగా ఉత్తర కొరియాకు చెందిన కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ ఫోటోలను విడుదల చేసింది. ఈ ఫోటోలలో ఉత్తర కోరియా అద్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ న్యూక్లియర్ వెపన్స్‌ను పరిశీలిస్తున్నట్లు కనిపించింది.
ఈ క్రమంలో బాలిస్టిక్ క్షిపణులపై వార్‌హెడ్‌లను అమర్చడానికి కొత్త వ్యూహాత్మక అణ్వాయుధాలు, సాంకేతికతను, అలాగే అణు ఎదురుదాడి ఆపరేషన్ ప్లాన్‌లను పరిశీలించారని KCNA తెలిపింది. కాగా యునైటెడ్ స్టేట్స్‌పై దాడి చేయగల ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులపై అమర్చగలిగేంత చిన్నదైన శక్తివంతమైన వార్‌హెడ్‌లను సూక్ష్మీకరించడంలో ఈ చిత్రాలు పురోగతిని సూచిస్తాయని అణు నిపుణులు తెలిపారు.
Also Read..
సూర్యుడిపై మాసివ్ హోల్.. భూమివైపు సౌర తుఫానులు వచ్చే అవకాశం!